దుబాయ్ ఎయిర్పోర్ట్లో చిక్కుకుపోయిన ప్రయాణీకులు ఇంటికి చేరుకునేందుకు అనుమతి
- October 08, 2020
దుబాయ్: 300 మందికి పైగా ప్రయాణీకులు దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్లో బుధవారం మధ్యాహ్నం చిక్కుకుపోగా, వారందరికీ దేశంలోకి ప్రవేశం కల్పిస్తూ అథారిటీస్ నిర్ణయం తీసుకున్నాయి. జనరల్ డైర్టెరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారినర్స్ ఎఫైర్స్, ఎయిర్పోర్ట్ పాస్పోర్ట్ డిపార్ట్మెంట్, రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీకి చెందిన అధికారులు ఓ బృందంగా ఏర్పడి, చిక్కుకుపోయిన ప్రయాణీకుల్ని వారి ఇళ్ళకు పంపే ఏర్పాట్లు చేశారు. పాలసీ అప్డేట్ నేపథ్యంలో ప్రయాణీకులు ఇబ్బంది పడ్డారు. కొత్త రూల్ ప్రకారం, ఎయిర్పోర్ట్కి వచ్చే ప్రయాణికులు ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ అండ్ సిటిజన్షిప్ నుంచి ప్రీ అప్రూవల్ పొందాల్సి వుంది. దుబాయ్లో ఇండియన్ కాన్సులేట్ జనరల్ - కాన్సుల్ ఫర్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ అండ్ కల్చర్ నీరజ్ అగర్వాల్ మాట్లాడుతూ, 290 మంది ఫ్లై దుబాయ్ ఇండియన్ ప్రయాణీకులు వారి వారి ఇళ్ళకు చేరుకున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!