కువైట్:యజమాని ఇంట్లో KD 11,000 చోరీ..ఐదుగురు గృహకార్మికుల అరెస్ట్

- October 09, 2020 , by Maagulf
కువైట్:యజమాని ఇంట్లో KD 11,000 చోరీ..ఐదుగురు గృహకార్మికుల అరెస్ట్

కువైట్ సిటీ:11,000 కువైట్ దినార్ లను దొంగిలించిన కేసులో అసియాకు చెందిన ఐదుగురు గృహ కార్మికులను అరెస్ట్ చేశారు పోలీసులు.కువైట్ లోని ఓ ఇంటి యజమాని ఫిర్యాదు మేరకు దర్యాప్తు ప్రారంభించారు. కంప్లైంట్ చేసిన సదరు యజమాని తన బెడ్రూంలో పెట్టిన 11,000 కువైట్ దినార్లు భద్రపరిచినట్లు, ఆ విషయంలో తన ఇంట్లో పని చేసేవారికి కూడా తెలుసని ఫిర్యాదులో పేర్కొన్నాడు. అయితే..పోలీసుల విచారణలో అరెస్టైన ఆ ఐదుగురు తమకు ఏ పాపం తెలియదని..తాము డబ్బు దొంగిలించలేదని తెలిపారు. మరోవైపు డబ్బు దాటిపెట్టిన బెడ్రూంలో ఫోరెన్సిక్ అధికారులు వేలి ముద్రలను సేకరించారు. ఇదిలాఉంటే..మరో ఘటనలో తన ఇంటికి కన్నం వేసి ఓ అంగతకుడు పరుపు కింద దాచిన 1,430 దినార్లను దోచుకెళ్లినట్లు ఈజిప్ట్ కు చెందిన వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. హవాలి ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. దర్యాప్తు చేపట్టిన అధికారులు..ఇంటి పరిసరాల్లో వేలి ముద్రలను సేకరించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com