మస్కట్:బీచ్ లను మూసివేసిన సుప్రీం కమిటీ..మళ్లీ ప్రకటించే వరకు బీచ్ బంద్

- October 10, 2020 , by Maagulf
మస్కట్:బీచ్ లను మూసివేసిన సుప్రీం కమిటీ..మళ్లీ ప్రకటించే వరకు బీచ్ బంద్

మస్కట్:కోవిడ్ తీవ్రత కొనసాగుతున్న నేపథ్యంలో బీచ్ లను పూర్తిగా మూసివేస్తున్నట్లు ఒమన్ ప్రభుత్వం ప్రకటించింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని వెల్లడించింది. అంతేకాదు..అన్ లాక్ లో భాగంగా గతంలో కొన్ని కార్యకలాపాలను ఇచ్చిన అనుమతులను కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. కోవిడ్ వ్యాప్తి నియంత్రణకు అనుగుణంగా..తగిన జాగ్రత్తలు తీసుకోకవటం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. అంతేకాదు..నిబంధనలు ఉల్లంఘించిన వారి ఫోటోలు, పేర్లు త్వరలోనే ప్రతికల ద్వారా వెల్లడిస్తామని అన్నారు. ఇదిలాఉంటే..కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా ఆక్టోబర్ 11 నుంచి అక్టోబర్ 24 వరకు పాక్షిక కర్ఫ్యూ అమలు చేస్తున్నామని, రాత్రి 8 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఎవరూ బయటికి రావొద్దని హెచ్చరించారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com