తెలంగాణలో కొత్తగా 1,811 కరోనా పాజిటివ్ కేసులు
- October 10, 2020
హైదరాబాద్:తెలంగాణ రాష్ట్రంలో నిన్న రాత్రి 8 గంటల వరకు కొత్తగా 1,811 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. నిన్న ఒక్కరోజే కరోనాతో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య 1,217కి చేరింది. నిన్న ఒక్క రోజే 2,072 మంది కరోనా నుండి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2,10,346కి చేరింది. ఇప్పటి వరకూ డిశ్చార్జి అయిన సంఖ్య 1,83,025కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 26,104 యాక్టివ్ కేసులు ఉన్నాయని, మరో 21,551 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు ఆరోగ్యశాఖ చెప్పింది. గడిచిన 24 గంటల్లో 50,469 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా ఇప్పటివరకు 35,50,394 టెస్టులు పూర్తి చేసినట్లు అధికారులు వెల్లడించారు.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- ట్రంప్ టారిఫ్ దెబ్బ, దిగుమతుల పై 15% సుంకం ప్రకటింపు
- టీబీజేపీ ప్రెసిడెంట్ రాంచందర్ రావు అరెస్ట్..
- శ్రీశైలంలో అగ్ని ప్రమాదం, భక్తులకు తప్పిన పెను ప్రమాదం
- హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రయాణికులకు రమదాన్ అనుభవం..!!
- కువైట్ టవర్స్: జాతీయ గుర్తింపుకు శాశ్వత చిహ్నం..!!
- ఉగ్రవాద సైబర్ దాడిని భగ్నం చేసిన యూఏఈ..!!
- బహ్రెయిన్‌ను లో మగ్రిబ్ డేట్స్ కు ఫుల్ డిమాండ్..!!
- 'మరూఫ్ ఒమన్' ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్ బలోపేతం..!!
- అమెరికా రాయబారి వ్యాఖ్యలను ఖండించిన సౌదీ అరేబియా..!!
- లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడి..10 మంది మృతి









