`జీ జాంబీ` మూవీ నుండి `లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్ చేసిన చిత్ర యూనిట్
- October 10, 2020హైదరాబాద్:తెలుగులో మొదటగా జాంబీ వైరస్ మీద సినిమా తీస్తున్న మహిళా దర్శకురాలు దీపిక. సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేసే దీపిక సినిమా మేకింగ్ పట్ల ఆసక్తితో జాంబీస్ వైరస్ మీద` జీ జాంబీ` అనే సినిమా రూపొందించడం జరిగింది. ఆర్యన్ గౌర, దివ్య పాండే హీరో హీరోయిన్లుగా నటించారు. ఇటీవల ఈ మూవీ ఫస్ట్ లుక్ ను నిర్మాత రాజ్ కందుకూరి, ఫస్ట్ సాంగ్ `ది జాంబీ.. `ను సక్సెస్ ఫుల్ చిత్రాల దర్శకుడు త్రినాధ్ రావ్ నక్కిన విడుదల చేయగా ఆ రెండింటికీ మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీ నుండి `అవును అని కాదు అని..` లిరికల్ వీడియోసాంగ్‌ను విడుదలచేసింది చిత్ర యూనిట్. ఈ సందర్భంగా..
దర్శకురాలు దీపిక మాట్లాడుతూ - ``ఇప్పటికే విడుదలైన మా మూవీ ఫస్ట్‌లుక్‌కి, ఫస్ట్ లిరికల్ వీడియోసాంగ్ జీ జాంబీ కు మంచి స్పందన వస్తోంది. ఈ రోజు మరో లిరికల్ వీడియో సాంగ్‌ను విడుదలచేయడం హ్యాపీగా ఉంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాం. మేము కష్టపడిన దానికి ప్రేక్షకులు మంచి ఫలితం ఇస్తారని భావిస్తున్నాము. ఆడియన్స్ థ్రిల్ అయ్యే ఎన్నో హారర్ సన్నివేశాలు ఈ సినిమాలో ఉన్నాయి. మా సినిమాకు పని చేసిన ప్రతి ఆర్టిస్ట్, టెక్నీషియన్ కు ధన్యవాదాలు. థియేటర్స్ లో విడుదలై మా సినిమా కచ్చితంగా మంచి పేరును తెస్తుందని భావిస్తున్నాం`` అన్నారు.
హీరో ఆర్యన్ మాట్లాడుతూ- ```అవును అని కాదు అని..` లిరికల్ వీడియోసాంగ్ అందరికి కనెక్ట్ అయ్యే విధంగా ఉండబోతోంది. వినోద్ కుమార్ (విన్ను) సంగీతం పాటకు మరింత అందాన్ని తెచ్చింది. ఆడియన్స్ థ్రిల్ అయ్యే అనేక అంశాలు ఈ సినిమాలో ఉన్నాయి. త్వరలో ఈ సినిమా టీజర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాం`` అన్నారు.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!