కోవిడ్-19 ప్రభావంతో సౌదీలో ఉద్యోగాలు కొల్పోయిన 19 వేల మంది ప్రవాసీయులు

- October 10, 2020 , by Maagulf
కోవిడ్-19 ప్రభావంతో సౌదీలో ఉద్యోగాలు కొల్పోయిన 19 వేల మంది ప్రవాసీయులు

రియాద్:కోవిడ్ 19 ప్రభావం సౌదీ ప్రైవేట్ సెక్టార్ లోని ఉద్యోగులపై పడింది. రెండో త్రైమాసికంలో ప్రైవేట్ సెక్టార్ లోని పలు రంగాల్లో దాదాపు 19 వేల ప్రవాసీయుల ఉద్యోగాలపై కోత పడిందని సౌదీ అరేబియా గణాంకాల అధికార విభాగం(GaStat) తెలిపింది. లాక్ డౌన్ కారణంగా చాలా కంపెనీలు తమ ఉద్యోగులను తగ్గించుకున్నాయని వెల్లడించింది. ప్రధానంగా విద్య రంగం, హోల్ సేల్, రిటైల్ మార్కెట్లు, వృత్తిపరమైన రంగాల్లో కోతలు ఎక్కువగా ఉన్నాయని విశ్లేషించింది. ఇక ప్రైవేట్ రంగంలో కొత్త వర్క్ వీసాల జారీలోనూ క్షీణత గణనీయంగా ఉందని, తొలి త్రైమాసికంలో 3,42,000 వీసాలు జారీ చేయగా..రెండో త్రైమాసికంలో 32 వేల వర్క్ వీసాలను మాత్రమే జారీ చేసినట్లు GaStat వివరించింది. కొత్తగా జారీ చేసిన వీసాల్లోనూ 97 శాతం నిరుపయోగంగా మారాయని, మరో 3 శాతం వీసాలు రద్దు చేయబడ్డాయని

తెలిపింది. లాక్ డౌన్ తర్వాత అంతర్జాతీయ ప్రయాణాలపై అమలైన ఆంక్షలే ఇందుకు కారణం కావొచ్చని అభిప్రాయపడింది. అయితే..ప్రస్తుతం నిరుద్యోగ శాతం ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నప్పటికీ...అన్ లాక్ ప్రక్రియ మొదలవటంతో మెల్లిమెల్లిగా ఆర్ధిక కార్యకలాపాలు పుంజుకునే అవకాశాలు లేకపోలేదని సౌదీ ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com