అబుధాబి: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే Dh50,000 జరిమానా..వాహనం జప్తు

- October 10, 2020 , by Maagulf
అబుధాబి: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే Dh50,000 జరిమానా..వాహనం జప్తు

అబుధాబి:వాహనదారులు దురుసు డ్రైవింగ్ కు బ్రేకులు వేసేందుకు ట్రాఫిక్ రూల్స్ ను మరింత కఠినతరం చేస్తూ కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చారు అబుధాబి పోలీసులు. ఎవరైనా ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తే తక్షణమే వాహనాన్ని జప్తు చేయటంతో పాటు 50 వేల దిర్హామ్ ల వరకు జరిమానా విధించనున్నట్లు పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ముఖ్యంగా స్ట్రీట్ రేస్, సిగ్నల్ జంపింగ్ విషయంలో మరింత కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. గతేడాదిలో అబుధాబి పరిధిలో స్పీడ్ రేసింగ్, సిగ్నల్ జంపింగ్ కారణంగా 894 యాక్సిడెంట్లు జరగ్గా..66 మంది ప్రాణాలు కొల్పొయారని పేర్కొన్నారు. ఇలాంటి ప్రమాదాలను నియంత్రించేందుకే ట్రాఫిక్ ఉల్లంఘునులపై కఠిన చర్యలకు ఉపక్రమించినట్లు పోలీసులు చెబుతున్నారు. రెడ్ లైట్ క్రాస్ చేయటం, స్ట్రీట్ రేసింగ్, నెంబర్ ప్లేట్ లేకుండా వాహనాలను నడపటం, పోలీసు వాహనాలను డ్యామేజ్ చేయటం, పాదాచారులకు దారి ఇవ్వకపోవటం, ఒక్కసారిగా వేగం పెంచటం, దారి మార్చటం లాంటివి చేస్తే ఉన్నఫళంగా వాహనాన్ని సీజ్ చేసి స్వాధీనం చేసుకుంటారు. ఆ తర్వాత నేర తీవ్రతను బట్టి 50 వేల దిర్హామ్ ల వరకు ఫైన్ వేస్తారు. స్వాధీనం చేసిన వాహనాలను మూడు నెలల్లోగా ఫైన్ కట్టి తీసుకెళ్లటంతో వాహనదారులు విఫలమైతే..ఆ వాహనాలను వేలం పాటలో అమ్మివేస్తామన్నారు. ఈ కొత్త నిబంధనలు సెప్టెంబర్ 9 నుంచే అమల్లోకి వచ్చాయని, ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు. 

--ప్రదీప్(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com