కువైట్:కర్ఫ్యూ విధింపు ప్రచారాన్ని కొట్టిపారేసిన ఆరోగ్య శాఖ మంత్రి
- October 11, 2020
కువైట్ సిటీ:కువైట్ లో మళ్లీ కర్ఫ్యూ విధిస్తారన్న ప్రచారాన్ని ఆరోగ్య శాఖ మంత్రి కొట్టిపారేశారు. దేశంలో కరోనా తీవ్రత కొనసాగుతుండటంతో ప్రభుత్వం మళ్లీ పాక్షికంగా కర్ఫ్యూ విధిస్తోందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన ఈ ప్రకటన చేశారు. హెల్త్ మినిస్ట్రి ఆధ్వర్యంలో శనివారమే మీటింగ్ జరిగిందని, ఆ సమావేశంలో అధికారులు పాక్షిక కర్ఫ్యూ విధింపు అవసమని నివేదిక ఇచ్చినట్లు కొందరు రూమర్లు సృష్టించారు. వచ్చే వారం నుంచే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందంటూ పోస్టులు పెట్టారు. ఈ విషయం కాస్తా ఆరోగ్య శాఖ మంత్రి దృష్టికి వెళ్లటంతో పాక్షిక కర్ఫ్యూ విధింపుపై స్పష్టత ఇచ్చిన ఆయన..అసలు శనివారం సమావేశమే జరగలేదని చెప్పారు. షెడ్యూల్ ప్రకారం ఆక్టోబర్ 11న (ఆదివారం) సమావేశం జరుగుతుందని..దేశంలో ప్రస్తుతం కరోనా పరిస్థితి ఇవాళ్టి సమావేశంలో చర్చిస్తామని మంత్రి క్లారిటీ ఇచ్చారు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు