తెలంగాణలో కొత్తగా 1,717 కరోనా పాజిటివ్ కేసులు
- October 11, 2020
హైదరాబాద్:తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,717 కరోనా కేసులు నమోదయ్యాయని ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. గత 24 గంటలుగా కరోనాతో ఐదుగురు మృతి చెందారు. కొత్తగా నమోదైన కేసులతో కలిపితే తెలంగాణలో మొత్తం కేసుల సంఖ్య 2,12,063కి చేరింది. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 1,222 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం తెలంగాణలో 25,713 యాక్టివ్ కేసులుండగా.. 1,85,128 మంది కరోనాను నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకూ తెలంగాణలో 35.47 లక్షల కరోనా టెస్టుల నిర్వహించినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. కొత్తగా GHMC 276 కరోనా కేసులు నమోదయ్యాయి.
----హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్ పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ
- పోస్టాఫీస్ అదిరిపోయే స్కీమ్..
- మోదీ పర్యటనకు ఘన ముగింపు..యుద్ధ విమానాలతో ఇండోనేషియా వీడ్కోలు
- నాగ్‌పూర్ విమానాశ్రయానికి బహుళ దశల విస్తరణ ప్రణాళికను ఆవిష్కరించిన GMR ఎయిర్‌పోర్ట్స్
- పీఎఫ్ ఖాతాదారులకు ఊరట..
- 45 పైసలకే రూ. 10 లక్షల బీమా.. IRCTC టికెట్ బుకింగ్‌లో అద్భుత ఆఫర్!
- సోషల్ మీడియా ట్రాప్.. దాడి, దోపిడీ చేసిన 9 మంది అరెస్ట్..!!
- కువైట్‌లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..!!
- దోహాలో ఎలక్ట్రిక్ రోబో-టాక్సీల ట్రయల్ రన్ పూర్తి..త్వరలో రెండో దశ..!!
- FIFA క్వార్టర్ ఫైనల్స్ షెడ్యూల్ ఇదీ!







