ఇక సులభంగా హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ చేసుకునేలా డిజిటలైజ్డ్ వ్యవస్థ ప్రారంభం

- October 11, 2020 , by Maagulf
ఇక సులభంగా హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ చేసుకునేలా డిజిటలైజ్డ్ వ్యవస్థ ప్రారంభం

యూఏఈ:పేషెంట్లకు నాణ్యమైన వైద్యం, సులభంగా ఇన్సూరెన్సు క్లెయిమ్ ల పరిష్కారం కోసం సమీకృత డేటా బేస్ సెంటర్ ను ప్రారంభించింది. దీన్నే పోస్ట్ ఆఫీస్ గా పిలుచుకుంటున్నారు. ఈ పోస్ట్ ఆఫీస్ ద్వారా జాతీయ వైద్య నివేదికలను సమీకృత కార్యక్రమం(రియాతి) నిర్వహిస్తారు. అంటే యూఏఈలోని ఆస్పత్రులు, క్లినిక్స్, హెల్త్ కేర్ ప్రొవైడర్స్ కు రియాతి అనుసంధానం అయి ఉంటుంది. చికిత్స పొందే రోగి వివరాలను, రోగికి అందుతున్న చికిత్స వివరాలను ఎప్పటికప్పుడు రియాతిలో అప్ డేట్ చేస్తారు. దీంతో ఆ రోగికి ఇంకా మెరుగైన వైద్య సేవలను అందించే విధానాలు ఏమైనా ఉన్నాయా అనే వివరాలను రియాతి(పోస్ట్ ఆఫీస్) సూచిస్తుంది. అదే సమయంలో రోగికి ఇన్సూరెన్స్ ఉందా..ఉంటే చికిత్సను బట్టి అతనికి చెల్లించాల్సిన బీమా డబ్బులను ఆన్ లైన్ అటోమెటిగ్గా సదరు ఆస్పత్రికి చెల్లించేలా పోస్ట్ ఆఫీస్ చర్యలు తీసుకుంటుంది. దీంతో బీమా క్లెయిమ్ లలో చికిత్స పొందుతున్న రోగికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అలాగే ఒకవేళ బీమా తిరస్కరించబడితే...అది ఎందుకు తిరస్కరించబడింది..క్లెయిమ్ చేసుకునేందుకు ఉన్న అవకాశాలను కూడా పోస్ట్ ఆఫీస్ ద్వారా ట్రాక్ చేయవచ్చు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com