కోవిడ్-19 నిబంధనలు ఉల్లంఘిస్తే ఇక ఫోటోలు,పేర్లు వెల్లడిస్తామని హెచ్చరించిన ఒమన్
- October 11, 2020
మస్కట్:ఎన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటున్న ప్రజల్లో అప్రమత్తత లేకపోవటంతో కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలోకి రావటం లేదు. కరోనా మృతుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది. మృతుల్లో అన్ని వయసుల వారు ఉండటం మరింత ఆందోళన కలిగిస్తోంది. దీంతో ఒమన్ ప్రభుత్వం మరింత కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ఇక నుంచి కోవిడ్ 19 నిబంధనలను ఉల్లంఘించిన వారి పట్ల నేమ్ అండ్ షేమ్ విధానాన్ని అనుసరించాలని డిసైడ్ అయ్యింది. కరోనా వ్యాప్తి నియంత్రణకు సుప్రీం కమిటీ ప్రకటించిన మార్గనిర్దేశకాలకు విరుద్ధంగా వ్యవహరించిన వారి పేర్లను, ఫోటోలను మీడియా ద్వారా వెల్లడిస్తామని హెచ్చరించింది. ముఖ్యంగా యువకులు మరింత అప్రమత్తంగా ఉండాలని, దేశ ప్రజల ఆరోగ్య భద్రత కోసం యువత నిబంధనలు పాటిస్తూనే కుటుంబ సభ్యుల్లో కూడా అవగాహన పెంచాలని సూచించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ జన సమూహ కార్యక్రమాలు నిర్వహించొద్దని, చివరికి కుటుంబ బంధువులు కూడా గుమికూడి నిర్వహించే కార్యక్రమాలకు దూరంగా ఉండాలని సుప్రీం కమిటీ తెలిపింది.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష