ఈసారి పాక్ నుంచి చైనా కు ఎదురుదెబ్బ!
- October 11, 2020
ఇస్లామాబాద్: భారత్ చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తత నెలకొన్న నేపధ్యంలో దేశ భద్రత దృష్ట్యా చైనాకు చెందిన టిక్ టాక్, పబ్ జీ, సహా 100 పైగా యాప్స్ ను భారత ప్రభుత్వం నిషేధించిన విషయం తెలిసిందే. అమెరికా కూడా చైనా యాప్స్, కంపెనీలపై నిషేదం విధిస్తుంది. భారత్ చైనా మధ్య యుద్దం వస్తె చైనాతో కలసి భారత్ పై దాడి చెయ్యాలని చైనాకు మిత్రదేశంగా ఉంటున్న పాకిస్తాన్ చూస్తోంది. అయితే తాజాగా పాక్ చైనాకు మిత్రదేశంగా ఉంటూనే భారీ షాక్ ఇచ్చింది. చైనాకు చెందిన టిక్‌టాక్‌పై నిషేధం విధిస్తూ పాకిస్థాన్ టెలీకమ్యూనికేషన్ అథారిటీ (పీటీఏ) ఆదేశాలు జారీచేసింది. ఈ యాప్‌లో అనైతిక/ అభ్యంతరకర సమాచారానికి వ్యతిరేకంగా ఫిర్యాదులు అందడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు పీటీఏ ప్రకటనలో పేర్కొంది. యాప్‌లో అభ్యంతరకరమైన సమాచారాన్ని తొలగించాలని జులై చివరిలోనే హెచ్చరించారు. చట్ట విరుద్ధమైన సమాచారాన్ని నియంత్రించేందుకుగాను సమర్థ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడానికి ఆ సంస్థకు తగిన సమయం ఇచ్చినా వారి నుండి ఎలాంటి స్పందన రాలేదని, ఆ సంస్థ చర్యలు సంతృప్తికరంగా లేకపోవడంతో ప్రధాని ఆదేశాల మేరకు నిషేధం విధించామని అధికారులు పేర్కొన్నారు. మిత్రదేశాలుగా ఉంటున్న పాక్ చైనాల మధ్య టిక్ టాక్ వల్ల రచ్చ మొదలయిందని విశ్లేషకులు అంటున్నారు. చైనా దీనిపై ఎలా స్పందిస్తుందో చూడాలి మరి..!!
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్ పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ
- పోస్టాఫీస్ అదిరిపోయే స్కీమ్..
- మోదీ పర్యటనకు ఘన ముగింపు..యుద్ధ విమానాలతో ఇండోనేషియా వీడ్కోలు
- నాగ్‌పూర్ విమానాశ్రయానికి బహుళ దశల విస్తరణ ప్రణాళికను ఆవిష్కరించిన GMR ఎయిర్‌పోర్ట్స్
- పీఎఫ్ ఖాతాదారులకు ఊరట..
- 45 పైసలకే రూ. 10 లక్షల బీమా.. IRCTC టికెట్ బుకింగ్‌లో అద్భుత ఆఫర్!
- సోషల్ మీడియా ట్రాప్.. దాడి, దోపిడీ చేసిన 9 మంది అరెస్ట్..!!
- కువైట్‌లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..!!
- దోహాలో ఎలక్ట్రిక్ రోబో-టాక్సీల ట్రయల్ రన్ పూర్తి..త్వరలో రెండో దశ..!!
- FIFA క్వార్టర్ ఫైనల్స్ షెడ్యూల్ ఇదీ!







