బాకు:రాకెట్ దాడిలో ఏడుగురు మృతి..
- October 11, 2020
బాకు:ఆర్మేనియా, అజర్బైజాన్ దేశాల మధ్య యుద్ధం కొనసాగుతున్నది. ఆదివారం తెల్లవారుజామున అజర్‌బైజాన్‌లోని గంజా నగరంపై ఆర్మేనియా రాకెట్ దాడికి పాల్పడింది. ఈ దాడిలో గంజాలోని ఓ భవనం పూర్తిగా ధ్వంసమైంది. దాంతో ఆ భవనంలోని ఏడుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. మరో 33 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో పలువురు చిన్నారులు కూడా ఉన్నారు. అజర్బైజాన్ విదేశాంగ శాఖ ఈ వివరాలను వెల్లడించింది. అయితే అజర్బైజాన్ ఆరోపణలను ఆర్మేనియా కొట్టిపారేసింది. కాగా, నగొర్నో కరబక్ విషయమై ఆర్మేనియా, అజర్బైజాన్ మధ్య గత కొన్ని రోజులుగా యుద్ధం జరుగుతున్నది.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్ పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ
- పోస్టాఫీస్ అదిరిపోయే స్కీమ్..
- మోదీ పర్యటనకు ఘన ముగింపు..యుద్ధ విమానాలతో ఇండోనేషియా వీడ్కోలు
- నాగ్‌పూర్ విమానాశ్రయానికి బహుళ దశల విస్తరణ ప్రణాళికను ఆవిష్కరించిన GMR ఎయిర్‌పోర్ట్స్
- పీఎఫ్ ఖాతాదారులకు ఊరట..
- 45 పైసలకే రూ. 10 లక్షల బీమా.. IRCTC టికెట్ బుకింగ్‌లో అద్భుత ఆఫర్!
- సోషల్ మీడియా ట్రాప్.. దాడి, దోపిడీ చేసిన 9 మంది అరెస్ట్..!!
- కువైట్‌లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..!!
- దోహాలో ఎలక్ట్రిక్ రోబో-టాక్సీల ట్రయల్ రన్ పూర్తి..త్వరలో రెండో దశ..!!
- FIFA క్వార్టర్ ఫైనల్స్ షెడ్యూల్ ఇదీ!







