నిజామాబాద్ ఎమ్మెల్సీగా టీఆర్ఎస్ అభ్యర్థి కవిత విజయం

- October 12, 2020 , by Maagulf
నిజామాబాద్ ఎమ్మెల్సీగా టీఆర్ఎస్ అభ్యర్థి కవిత విజయం

తెలంగాణ:నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత ఘన విజయం సాధించారు. మొదటి ప్రాధాన్యత ఓటుతోనే ఫలితం వెల్లడి అయింది.14వ ఎమ్మెల్సీగా కవిత ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక కాంగ్రెస్‌, బీజేపీ డిపాజిట్లు కోల్పోయాయి. అధికార పార్టీ‌ ఆది నుంచి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా దూకుడు ప్రదర్శించింది. ప్రత్యర్థులను చిత్తు చేసే ఎత్తుగడలు వేస్తూ ‘కారు’వేగంతో దూసుకెళ్లింది. భారీ మెజారిటీ లక్ష్యంగా టీఆర్‌ఎస్‌ పకడ్బందీగా అమలు చేసిన వ్యూహానికి ప్రత్యర్థి పార్టీలు డీలా పడ్డాయి. టీఆర్‌ఎస్‌కు 728.. బీజేపీకి 56.. కాంగ్రెస్‌కు 29 ఓట్లు వచ్చాయి.

 

మొత్తం 823 ఓట్లు..

టీఆర్ఎస్‌కు 728 ఓట్లు
బీజేపీకి 56 ఓట్లు
కాంగ్రెస్‌కు 29 ఓట్లు..
చెల్లని ఓట్లు 10

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com