'మహాసముద్రం'లో హీరోయిన్‌గా అదితి రావ్ హైదరి
- October 12, 2020
ఒక్కో అనౌన్స్‌మెంట్‌తో 'మహాసముద్రం' చిత్రం ప్రేక్షకుల్లో ఆసక్తిని మరింతగా పెంచుకుంటూ వస్తోంది. శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా నటిస్తోన్న ఈ సినిమాని 'ఆర్ఎక్స్ 100' ఫేమ్ అజయ్ భూపతి డైరెక్ట్ చేస్తున్నారు.
లేటెస్ట్‌గా ఈ ఫిల్మ్‌కు సంబంధించి మరో ఆసక్తికర అనౌన్స్‌మెంట్ వచ్చింది. అందచందాలతో పాటు అభినయ సామర్థ్యం పుష్కలంగా ఉన్న తారగా ఇటు ప్రేక్షకుల, అటు విమర్శకుల ప్రశంసలు పొందుతున్న అదితి రావ్ హైదరి ఇందులో హీరోయిన్‌గా ఎంపికయ్యారు.
పర్ఫార్మెన్స్‌కు బాగా స్కోప్ ఉన్న ఆ కీలక పాత్రకు పలువురి తారల పేర్లను పరిశీలించాక, అదితి రావ్ అయితే ఆ పాత్రకు న్యాయం జరుగుతుందని దర్శక నిర్మాతలు భావించారు. ఈ ప్రాజెక్టులో భాగం కావడంతో అదితి రావ్ సైతం ఆనందం వ్యక్తం చేశారు.
ఇంటెన్స్ లవ్ అండ్ యాక్షన్ డ్రామా అయిన 'మహాసముద్రం'ను ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్నారు.
తారాగణం:
శర్వానంద్, సిద్ధార్థ్, అదితి రావ్ హైదరి
సాంకేతిక బృందం:
దర్శకుడు: అజయ్ భూపతి
నిర్మాత: సుంకర రామబ్రహ్మం
తాజా వార్తలు
- సౌదీలో అక్రమ నివాసితులపై ఉక్కుపాదం.. వారంలో దాదాపు 15 వేల మంది అరెస్ట్..!!
- అక్రమ బరువు తగ్గించే మందులపై యూఏఈ ఉక్కుపాదం..!!
- ఒమన్ రియల్ ఎస్టేట్ రంగంలో కీలక సంస్కరణలు..!!
- కువైట్‌లో కల్తీ చేపలపై ఫుడ్ అథారిటీ కొరడా..!!
- ఖతార్‌లో సముద్ర రవాణా సేవలు పునరుద్ధరణ..!!
- భారత్, బహ్రెయిన్ మధ్య న్యాయ సహకారానికి కొత్త దిశ..!!
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’







