హైదరాబాద్ లో 72 గంటల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం
- October 12, 2020
హైదరాబాద్:అక్టోబర్ 12 మధ్యాహ్నం నుంచి 72 గంటల పాటు అంటే దాదాపు 3 రోజుల పాటు హైదరాబాద్ మహా నగర వాసులు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ- గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ హెచ్చరిస్తోంది. ఈ మేరకు సోమవారం మధ్యాహ్నం కమిషనర్ డీ.ఎస్. లోకేశ్ కుమార్ 72 గంటల పాటు నగరం పరిధిలోని పలు చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అన్నారు. కొన్ని చోట్ల 9 నుంచి 16 సెంటీమీటర్ల వర్షం పడే అవకాశం ఉందని తెలిపారు. రాబోయే 72 గంటల పాటు అధికారులు, సహాయ బృందాలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. భారీ వర్షాల వలన ఏర్పడే వరద పరిస్థితిని ఎదుర్కునేందుకు ఎమర్జెన్సీ బృందాలను అప్రమత్తం చేసి, ఆయా ప్రాంతాల్లో రిలీఫ్ సెంటర్లుగా గుర్తించిన పాఠశాలలు, కమ్యూనిటీ హాల్స్, ఇతర వసతులను సిద్ధంగా ఉంచాలని సూచించారు. అధికారులు అందుబాటులో ఉండాలని కమిషనర్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.
తాజా వార్తలు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..