కువైట్ నూతన అమీర్ తో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సమావేశం
- October 12, 2020
కువైట్ సిటీ:కువైట్ పర్యటలో ఉన్న భారత పెట్రోలియం, నేచురల్ గ్యాస్ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్...కువైట్ అమీర్ గా బాధ్యతలు స్వీకరించిన షేక్ నవాఫ్ అల్-అహ్మద్ అల్-జాబెర్ అల్-సబాతో సమావేశం అయ్యారు. ఇటీవలె కన్నుమూసిన కువైట్ అమీర్ షేక్ సబా అల్-అహ్మద్ అల్-జాబెర్ అల్-సబా మృతికి విచారం వ్యక్తం చేశారు. భారత రాష్ట్రపతి, ప్రధాని పంపిన సంతాప లేఖలను కువైట్ పాలకులకు అందజేశారు. అదేసమయంలో కువైట్ కొత్త అమీర్ గా బాధ్యతలు స్వీకరించిన షేక్ నవాఫ్ అల్-అహ్మద్ అల్-జాబెర్ అల్-సబాతో పాటు క్రౌన్ ప్రిన్స్ షేక్ మిషేల్ అల్-అహ్మద్ అల్-జాబెర్ అల్-సబాకు భారత ప్రభుత్వం తరపున కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్ శుభాకాంక్షలు తెలుపారు. ఆ తర్వాత..కువైట్ విద్యుత్, నీరు, చమురు శాఖ మంత్రి డాక్టర్ ఖలీద్ అలీ అల్ ఫదాల్ తో సమావేశమైన ధర్మేంద్ర ప్రదాన్ ద్వైపాక్షిక
సంబంధాలు..చమురు రంగంలో ఇరు దేశాల పరస్పర సహకారంపై మాట్లాడుకున్నారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)

తాజా వార్తలు
- T20 వరల్డ్ కప్ 2026: ఒమన్ పై ఆస్ట్రేలియా ఘన విజయం
- టీటీడీలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం
- మేకపాటి గౌతమ్ పేరుతో ధ్యాన మందిరం
- డొనాల్డ్ ట్రంప్‌కి బిగ్ షాక్..
- హైవే పై గ్యాస్ ట్యాంకర్ పేలుడు
- ‘PhonePe’లో అదిరిపోయే ఫీచర్!
- మదీనాలో ఆరోగ్య , వాణిజ్య కార్యకలాపాలలో తనిఖీలు..!!
- మూడు ప్రైవేట్ ఫార్మసీల లైసెన్సులు రద్దు..!!
- BD4,633 సైక్లింగ్..ప్రవాసురాలికి జైలుశిక్ష ఖరారు..!!
- యూఏఈలో లైసెన్స్ లేని, నకిలీ సంస్థలను ఎలా గుర్తించాలి?









