భారీ వర్షాల నేపథ్యంలో పోలీస్ శాఖను అప్రమత్తం చేసిన ఏ.పి డీ.జీ.పీ
- October 12, 2020
అమరావతి:ఏ.పి రాష్ట్ర వ్యాప్తంగా రానున్న మూడు రోజులు భారీ వర్షాలున్నందున రాష్ట్రంలోని స్టేషన్ హౌస్ ఆఫీసర్ల నుండి జిల్లా ఎస్.పీ లు. పోలీస్ కమీషనర్లందరూ అప్రమత్తంగా ఉండాలని డీ.జీ.పీ. గౌతం సవాంగ్ IPS ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలో పోలీస్ శాఖ మొత్తాన్ని డీ.జీ.పీ. అప్రమత్తం చేశారు. పోలీస్ అధికారులందరూ 24 గంటల పాటు విధుల్లో ఉండి ప్రజలకు ఏవిధమైన అసౌకర్యం కలుగ కుండా చూడాలని పేర్కొన్నారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు, వరద తీవ్రత అధికంగా ఉండే ప్రాంతాలపై ప్రత్యేక పర్యవేక్షణ చేయాలని సూచించారు. జిల్లా కలెక్టర్లు, రాష్ట్ర విపత్తుల నివారణ శాఖ(SDRF), NDRF ఇతర శాఖలతో సమన్వయంతో పని చేయాలని కోరారు. ఎక్కడ ఏవిధమైన ఇబ్బందులు ఎదురైనా సత్వరమే ప్రజలు డయల్ 100/112 కు సమాచారం అందించాలని రాష్ట్ర ప్రజలను డీ.జీ.పీ కోరారు.
--ఆర్.వి.ఆర్ ప్రసాద్(మాగల్ఫ్ ప్రతినిధి,ఏ.పి)
తాజా వార్తలు
- ‘అరబ్ రీడింగ్ ఛాలెంజ్’ విజేతలతో షేక్ మొహమ్మద్ భేటీ
- నేపాల్‌కు మూడో యూఏఈ సహాయక విమానం.. సెర్చ్ అండ్ రెస్క్యూ బృందం రాక
- అబ్దుల్ రెహ్మాన్ యూసుఫ్ అల్-ఖరదావీకి యూఏఈ అధ్యక్షుడి క్షమాభిక్ష
- షార్జా ప్రభుత్వ ఉద్యోగులకు కనీస జీవన ప్రమాణం AED 20,000కు పెంపు
- భారత, క్యూబా రాయబారులతో ఫుజైరా క్రౌన్ ప్రిన్స్ భేటీ
- తిరుమల శ్రీవారి ఆలయ కొత్త డిప్యూటీ ఈఓగా భాస్కర్!
- డిస్కౌంట్ నిబంధనలు.. ఆగస్టులో 20 వేలకుపైగా తనిఖీలు..!!
- కువైట్ లో సబ్లీజింగ్.. ప్రైవేట్ క్లినిక్ లైసెన్స్ రద్దు..!!
- నేపాల్ వరద బాధితులకు కేంద్రం సాయం
- యూఏఈలో యాంటి కమర్షియల్ ఫ్రాడ్ లా.. 24గంటల్లో తొలగించాల్సిందే..!!







