కరోనా నుంచి కోలుకున్న ఉపరాష్ట్రపతి
- October 12, 2020
న్యూ ఢిల్లీ:ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు కరోనా నుంచి కోలుకున్నారు. కొద్ది రోజుల క్రితం కరోనా సంక్రమణకు గురైన వారికి ఇతర వైరస్ లక్షణాలేవీ కనిపించలేదు. అయితే వైద్యుల సూచన మేరకు వారు స్వీయ నిర్బంధంలోకి వెళ్ళారు.
సోమవారం నాడు ఎయిమ్స్ వైద్యుల బృందం నిర్వహించిన పరీక్షల్లో నెగటీవ్ ఫలితం వచ్చింది. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదిగా ఉపరాష్ట్రపతి తెలియజేశారు. తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని, అయితే వైద్యుల సూచనలను మరికొంత కాలం పాటు కొనసాగించడం మంచిదని, ఇంటి నుంచే జాగ్రత్తలు పాటిస్తూ, పని చేయాలని భావిస్తున్నట్లు తెలియజేశారు.
స్వీయ నిర్బంధ కాలంలో తమ ఆరోగ్య పరిస్థితి గురించి ఉత్తరాలు, మెయిల్స్, మెసేజ్ ల ద్వారా వాకబు చేసిన ప్రజలకు, ప్రాంతాలు, పార్టీలు, మతాలకు అతీతంగా ఆయన కోలుకోవాలని ఆకాంక్షించి, ప్రార్థనలు నిర్వహించిన వారందరి ప్రేమాభిమానాలకు ఉపరాష్ట్రపతి ధన్యవాదాలు తెలిపారు.
కరోనా సంక్రమణ కాలంలో వారికి ఆరోగ్య సేవలు అందించిన వైద్యులు, వైద్య సిబ్బందికి ఉపరాష్ట్రపతి కృతజ్ఞతలు తెలియజేశారు. అదే విధంగా తనకు తోడుగా అన్నివేళలా సేవలు అందించిన తమ వ్యక్తిగత సహాయకులకు కూడా ఆయన ధన్యవాదాలు తెలియజేశారు.
తాజా వార్తలు
- ‘అరబ్ రీడింగ్ ఛాలెంజ్’ విజేతలతో షేక్ మొహమ్మద్ భేటీ
- నేపాల్‌కు మూడో యూఏఈ సహాయక విమానం.. సెర్చ్ అండ్ రెస్క్యూ బృందం రాక
- అబ్దుల్ రెహ్మాన్ యూసుఫ్ అల్-ఖరదావీకి యూఏఈ అధ్యక్షుడి క్షమాభిక్ష
- షార్జా ప్రభుత్వ ఉద్యోగులకు కనీస జీవన ప్రమాణం AED 20,000కు పెంపు
- భారత, క్యూబా రాయబారులతో ఫుజైరా క్రౌన్ ప్రిన్స్ భేటీ
- తిరుమల శ్రీవారి ఆలయ కొత్త డిప్యూటీ ఈఓగా భాస్కర్!
- డిస్కౌంట్ నిబంధనలు.. ఆగస్టులో 20 వేలకుపైగా తనిఖీలు..!!
- కువైట్ లో సబ్లీజింగ్.. ప్రైవేట్ క్లినిక్ లైసెన్స్ రద్దు..!!
- నేపాల్ వరద బాధితులకు కేంద్రం సాయం
- యూఏఈలో యాంటి కమర్షియల్ ఫ్రాడ్ లా.. 24గంటల్లో తొలగించాల్సిందే..!!







