అమెరికా పాస్ పోర్టుదారులకు పదేళ్ల మల్టీ ఎంట్రీ వీసా ప్రకటించిన బహ్రెయిన్
- October 12, 2020
మనామా:అమెరికాతో దోస్తీని పెంచుకునే ప్రక్రియలో బహ్రెయిన్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికా పాస్ పోర్టు ఉన్నవారికి పదేళ్ల గడవు ఉండే మల్టీ ఎంట్రీ వీసా స్కీంను ప్రకటించింది. అంటే వీసా తీసుకున్న అమెరికన్లు ఈ పదేళ్లలో ఎప్పుడైనా బహ్రెయిన్ చేరుకోవచ్చు. బహ్రెయిన్ వచ్చిన ప్రతిసారి గరిష్టంగా 90 రోజుల పాటు ఉండేందుకు అటోమెటిక్ గా అనుమతి ఉంటుంది. పదేళ్ల మల్టి ఎంట్రీ వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే అమెరికన్లుhttp://www.e-visa.gov.bh ద్వారా BD60 ఫీజు చెల్లించి అప్లై చేసుకోవాలని బహ్రెయిన్ జాతీయ పాస్ పోర్ట్, నివాస వ్యవహారాల శాఖ అధికారులు వెల్లడించారు. అమెరికా-బహ్రెయిన్ కుదుర్చుకున్న స్నేహపూర్వక ఒప్పందంలో భాగంగా బహ్రెయిన్ ఎగ్జిక్యూటీవ్ కమిటీ నిర్ణయం మేరకు పదేళ్ల వీసా స్కీంను అమలు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. అదేసమయంలో అటు అమెరికా నుంచి ఇదే తరహాలో బహ్రెయిన్లకు ప్రధాన్యత ఉంటుందని, బహ్రెయిన్ వసూలు చేస్తున్న ఫీజుకు సమాన ఫీజుతో అమెరికా కూడా దీర్ఘకాల వీసాలు ఇస్తుందని వెల్లడించారు.
తాజా వార్తలు
- ‘అరబ్ రీడింగ్ ఛాలెంజ్’ విజేతలతో షేక్ మొహమ్మద్ భేటీ
- నేపాల్‌కు మూడో యూఏఈ సహాయక విమానం.. సెర్చ్ అండ్ రెస్క్యూ బృందం రాక
- అబ్దుల్ రెహ్మాన్ యూసుఫ్ అల్-ఖరదావీకి యూఏఈ అధ్యక్షుడి క్షమాభిక్ష
- షార్జా ప్రభుత్వ ఉద్యోగులకు కనీస జీవన ప్రమాణం AED 20,000కు పెంపు
- భారత, క్యూబా రాయబారులతో ఫుజైరా క్రౌన్ ప్రిన్స్ భేటీ
- తిరుమల శ్రీవారి ఆలయ కొత్త డిప్యూటీ ఈఓగా భాస్కర్!
- డిస్కౌంట్ నిబంధనలు.. ఆగస్టులో 20 వేలకుపైగా తనిఖీలు..!!
- కువైట్ లో సబ్లీజింగ్.. ప్రైవేట్ క్లినిక్ లైసెన్స్ రద్దు..!!
- నేపాల్ వరద బాధితులకు కేంద్రం సాయం
- యూఏఈలో యాంటి కమర్షియల్ ఫ్రాడ్ లా.. 24గంటల్లో తొలగించాల్సిందే..!!







