బీఎస్ఎఫ్‌లో కానిస్టేబుల్ ఉద్యోగాలు..

- October 13, 2020 , by Maagulf
బీఎస్ఎఫ్‌లో కానిస్టేబుల్ ఉద్యోగాలు..

బీఎస్ఎఫ్‌లో కానిస్టేబుల్ ఉద్యోగాలు..

కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా ఇంజనీరింగ్, ఎయిర్ వింగ్ గ్రూప్-సీలో ఖాళీగా ఉన్న 228 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఇందులో కానిస్టేబుల్ ట్రేడ్స్‌మెన్, జేఈ లేదా ఎస్సై, ఏపీ, హెచ్‌సీ, ఏఎస్సై పోస్టులు ఉన్నాయి. దరఖాస్తులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. అక్టోబర్ 28 దరఖాస్తుకు ఆఖరు తేదీ.

మొత్తం పోస్టులు: 228 కానిస్టేబుల్ ట్రేడ్స్‌మెన్ (బీఎస్ఎఫ్)-75 కానిస్టేబుల్ (ట్రేడ్స్‌మెన్): 75 గ్రూప్ బీ ఇంజనీరింగ్ కేడర్: 52 గ్రూప్ సీ ఎయిర్ వింగ్ కేడర్: 22 గ్రూప్ సీ: 64 ఇంజనీరింగ్ కేడర్:15 ముఖ్య సమాచారం అర్హత: ఒక్కో పోస్టుకు ఒక్కో విధంగా ఉన్నాయి. పూర్తి వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో చూడొచ్చు. వయసు: 18-28 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక విధానం : పీఎస్టీ, పీఈటీ, డాక్యుమెంటేషన్, ట్రేడ్ టెస్ట్, రాత పరీక్ష, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులకు చివరి తేదీ: ఇంజనీరింగ్ క్యాడర్ పోస్టులకు అక్టోబర్ 15, గ్రూప్ బీ ఇంజనీరింగ్ క్యాడర్, ఎయిర్ వింగ్, కానిస్టేబుల్ ట్రేడ్స్‌మెన్ పోస్టులకు- అక్టోబర్ 23, గ్రూప్ సీ పోస్టులకు -అక్టోబర్ 28. వెబ్‌సైట్:https://bsf.gov.in/

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com