తెలంగాణ అసెంబ్లీ సమావేశాల షెడ్యూల్ విడుదల

- October 13, 2020 , by Maagulf
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల షెడ్యూల్ విడుదల

హైదరాబాద్:తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది. అక్టోబర్ 13న ఉదయం 11:30 గంటలకు శాసన సభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 14న ఉదయం 11గంటలకు శాసన మండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఓ ప్రకటనలో శాసనసభ కార్యదర్శి డా.వి నర్సింహా చార్యులు స్పష్టం చేశారు. కాగా ఈ సమావేశాల్లో జీహెచ్ఎంసీకి సంబంధించిన ఓ చట్ట సవరణపై నిశితంగా చర్చించనున్నారు. దీంతో పాటు పలు విషయాలపై చర్చించి ఆమోదం తెలిపే అవకాశాలు మెండుగా ఉన్నాయి.. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com