తెలంగాణలో ప్రజా సమస్యలపై పోరాటం ఆగదు-ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి

- October 13, 2020 , by Maagulf
తెలంగాణలో ప్రజా సమస్యలపై పోరాటం ఆగదు-ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి

హైదరాబాద్:తెలంగాణలో ప్రజా సమస్యలపై పోరాటం ఆగదని.. ఈ క్రమంలో ఎవరికీ భయపడాల్సిన పని లేదని... పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో ఏ అధికారి ప్రజల కోసం పని చేయడం లేదని... ఇక పోలీసులైతే తాము ఉద్యోగులమన్న సంగతే మరచిపోయారని తీవ్ర స్థాయిలో విమర్శించారు. కాంగ్రెస్‌ కార్యకర్తలు నిరుత్సాహ పడాల్సిన పనిలేదని.. గతంలో ఇందిరాగాంధీ ఓడినప్పుడు.. యూత్‌ కాంగ్రెస్‌ దేశవ్యాప్తంగా పోరాటాలు చేసి.. తిరిగి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిందని గుర్తు చేశారు. తెలంగాణలో కూడా ప్రజల కోసం పోరాటాలు చేయాలని.. సమస్యల పరిష్కారంలో ముందుండాలని ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి సూచించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com