ప్రముఖ కూచిపూడి న్యత్యకారిణి శోభానాయుడు మృతి
- October 14, 2020
హైదరాబాద్:ప్రముఖ కూచిపూడి న్యత్యకారిణి శోభానాయుడు కన్నుమూశారు. అనారోగ్యంతో చికిత్స పొందుతూ రాత్రి ఒంటి గంట 44 నిమిషాలకు మృతి చెందారు. 1962లో విశాఖ జిల్లా అనకాపల్లెలో జన్మించిన శోభానాయుడు... చిన్న వయసులోనే నృత్యరూపకాల ద్వారా ప్రసిద్ధి చెందారు. విఖ్యాత కూచిపూడి గురువు వెంపటి చినసత్యం శిష్యురాలిగా.... ఆయన బృందంలో సభ్యురాలిగా దేశవిదేశాల్లో ప్రదర్శనలతో గుర్తింపు పొందారు. నృత్యరూపకాల్లో సత్యభామ, పద్మావతి పాత్రలతో ప్రసిద్ధి చెందారు. కూచిపూడి నృత్యకారిణిగా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన శోభానాయుడు.... 2001లో పద్మశ్రీ అవార్టు అందుకున్నారు. సంగీత నాటక అకాడమీ, నృత్య కళాశిరోమణి, నృత్య చూడామణి, ఏపీ ప్రభుత్వం అందించే హంసా అవార్డులు శోభానాయుడును వరించాయి. దేశ విదేశాల్లో సుమారు 15 వందల మందికి కూచిపూడి నృత్యంలో శిక్షణ అందించారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష