సినీనటుడు సచిన్ జోషి అరెస్ట్

- October 15, 2020 , by Maagulf
సినీనటుడు సచిన్ జోషి అరెస్ట్

హైదరాబాద్:గుట్కా అక్రమ రవాణా కేసులో సినీ నటుడు, నిర్మాత సచిన్‌ జోషిని హైదరాబాద్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. సచిన్‌ జోషి.... హైదరాబాద్‌కు భారీగా గుట్కా తరలిస్తున్నట్లు గుర్తించారు. దీంతో ఆయన్ను ముంబైలో అదుపులోకి తీసుకున్నారు. దుబాయ్ నుంచి ముంబైకి రాగానే ఆయన్ను అరెస్ట్ చేసి.. హైదరాబాద్ కు తరలించారు. ఐపీసీ 273,336 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ ఏడాది మార్చిలో హైదరాబాద్‌లో భారీగా గుట్కా అక్రమ రవాణాని పోలీసులు పట్టుకున్నారు. 80 గుట్కా బాక్సులు దొరకటంతో సెలబ్రిటీలపై పోలీసులు నిఘా పెంచారు. నిందితుల విచారణలో పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ విచారణలో సచిన్‌ జోషి పేరు బయటకు రావడంతో పక్కా ఆధారాలతో పోలీసులు అరెస్ట్‌ చేశారు. మత్తు పదార్థాలు అమ్మకాలకు పాల్పడుతూ ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారారనే ఆరోపణలతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. గుట్కా బాక్సులను స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న గుట్కా కోట్ల రూపాయల్లో ఉంటుందని సమాచారం.

హిందీలో అత్యంత సంపన్నమైన నటుల్లో సచిన్‌ జోషి ఒకరు. గుట్కా వ్యాపారంలో ప్రసిద్ధి చెందాడు. గుట్కా కింగ్‌గా ఆయన తండ్రిని పిలుస్తుంటారు. ఓ వైపు ముంబై, మరోవైపు హైదరాబాద్‌లో అక్రమంగా ఈ వ్యాపారం సాగిస్తున్నట్లు గుర్తించారు. ఇలా అక్రమంగా భారీ సంపాదించి ఎంజాయ్‌ చేస్తుంటారని, అందులో భాగంగానే సినిమాలు చేస్తున్నారని తెలుస్తోంది. మౌనమేలనోయి, నిను చూడక నేనుండలేను, ఒరేయ్‌ పండు, ఆజాన్‌, జాక్‌పాట్‌, వీరప్పన్‌, వీడెవడు, నెక్ట్స్ ఏంటీ, అమావాస్‌ వంటి చిత్రాల్లో సచిన్ జోషి నటించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com