దోహా: వీధులు, పారిశ్రామిక వాడల్లో వదిలి వెళ్లిన 9,300 వాహనాల స్వాధీనం
- October 15, 2020
దోహా:రోడ్లకు ఇరు వైపుల, వీధులు, పారిశ్రామిక వాడల్లో వాహనదారులు నిరుపయోగంగా వదిలేసిన కార్లను ఖతార్ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. గత జనవరి నుంచి ఇప్పటివరకు 9.300 వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. కొందరు వాహనదారులు వాహనాలను వీధుల్లో వదిలేసి వాటిని పట్టించుకోటం లేదని, అవి దుమ్ముకొట్టుకుపోయి పరిశుభ్ర వాతావరణానికి హానికరంగా మారటమే కాకుండా, ఆయా నగరాల ఇమేజ్ ను కూడా డ్యామేజ్ చేస్తున్నాయన్నది అధికారుల వాదన. అంతేకాదు...చోరీలకు కూడా ఆస్కారం ఇస్తున్నాయని చెబుతున్నారు. అందుకే వీధులు, పారిశ్రామిక వాడల్లో నిరుపయోగంగా వదిలివేసిన వాహనాలను యజమానులు తీసుకువెళ్లాలని చాలాసార్లు సూచించామని, అయితే..వారు స్పందించకపోవటంతో వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వివరించారు. వివిధ మున్సిపాలిటీ పరిధిలో నిరుపయోగంగా వాహనాల తొలగింపు డ్రైవ్ చేపట్టిన జాయింట్ కమిటీ..చివరగా అల్ షిహానియా మున్సిపాలిటీ పరిధిలో వాహనాల తొలగింపు డ్రైవ్ చేపట్టింది. మున్సిపాలిటీ పరిధిలో 150 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఏడాదికి ఇదే చివరి డ్రైవ్ అని.. వచ్చే ఏడాది కొత్త స్ట్రాటజీతో మళ్లీ వాహనాల తొలగింపు డ్రైవ్ చేపడతామని జాయింట్ కమిటీ స్పష్టం చేసింది. 2013 నుంచి ప్రారంభమైన ఈ డ్రైవ్ లో ఇప్పటివరకు 81,000 వేల వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అందులో 44,000 వాహనాలను డిస్పోజ్ చేశారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష