PNB మహిళల కోసం ప్రత్యేక ఖాతా...

- October 16, 2020 , by Maagulf
PNB మహిళల కోసం ప్రత్యేక ఖాతా...

న్యూ ఢిల్లీ: భారత దేశ రెండో అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ పీఎన్‌బీ తాజాగా కస్టమర్లకు తీపికబురు అందించింది. మహిళల కోసం ప్రత్యేకంగా పవర్ సేవింగ్స్ అకౌంట్ సర్వీసులు అందుబాటులోకి తీసుకువచ్చింది. దీని ద్వారా మహిళలు పలు రకాల బెనిఫిట్స్ పొందవచ్చు. ట్విట్టర్ వేదికగా బ్యాంకు ఈ కొత్త సర్వీసులను అందిస్తున్నట్లు ప్రకటించింది. పీఎన్‌బీ పవర్ సేవింగ్స్ అనేది ప్రత్యేకమైన స్కీమ్. ఇది మహిళలకు మాత్రమే అందుబాటులో ఉన్నా జాయింట్ అకౌంట్ తెరుచుకునే వెసులుబాటు కూడా ఉంది. కానీ మొదటి పేరు మాత్రం మహిళదే అయి ఉండాలి అని పీఎన్‌బీ ట్విట్టర్‌లో పేర్కొంది.

ఇక గ్రామాల్లో ఉండే మహిళలైతే రూ.500 చెల్లించి ఖాతా తెరవొచ్చు. అదే పాక్షిక పట్టణాల్లో ఉండే వారైతే రూ.1000.. పట్టణాలు, ఇతర నగరాల్లో నివాసం ఉండే వారైతే రూ.2,000 చెల్లించి ఈ ఖాతా తెరవొచ్చు. ఖాతా తెరిచిన మహిళలకు 50 పేజీల చెక్ బుక్ ఉచితంగా ఇస్తారు. నెప్ట్ మనీ ట్రాన్స్‌ఫర్ సర్వీసులు ఫ్రీగా లభిస్తాయి. బ్యాంక్ నుంచి ప్లాటినం డెబిట్ కార్డు ఉచితంగా ఇస్తారు. ఎస్ఎంఎస్ అలర్ట్స్ ఫ్రీ. రోజుకు అకౌంట్ నుంచి రూ.50,000 వరకు విత్ డ్రా చేసుకోవచ్చు. ఇకపోతే అకౌంట్ కలిగిన వారికి రూ.5 లక్షల వరకు ఉచిత ప్రమాద బీమా లభిస్తుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com