బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
- October 17, 2020
న్యూఢిల్లీ: పూలజాతర జరపుకుంటున్న తెలంగాణ ప్రజలకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ‘బతుకమ్మ’ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. నవరాత్రుల్లో అమ్మవారిని ప్రకృతి శక్తిగా ఆరాధించే సంప్రదాయం నుంచి బతుకమ్మ పండుగ పుట్టిందని, కరోనా నేపథ్యంలో ప్రభుత్వ సూచనలు పాటిస్తూ పండుగను జరుపుకోవాలని సూచించారు. ఈమేరకు ట్వీట్ చేశారు. ‘‘ప్రకృతితో మమేకమై జరుపుకునే ‘బతుకమ్మ’ పండుగ సందర్భంగా తెలంగాణ ప్రజలకు హార్దిక శుభాకాంక్షలు. మన జీవసృష్టికి ప్రకృతే మూలం. అలాంటి ప్రకృతిని కాపాడుకుంటూ, సంస్కృతిని పాటిస్తూ ముందుకెళ్తేనే పురోగతి సాధ్యమని నేను బలంగా విశ్వసిస్తాను. నవరాత్రుల్లో.. అమ్మవారిని ప్రకృతిశక్తిగా ఆరాధించే సంప్రదాయం నుంచి పుట్టిన ఈ బతుకమ్మ పండుగలో కులాలకు అతీతంగా అందరూ ఉత్సాహంగా పాలుపంచుకోవడం ఓ చక్కటి సంప్రదాయం. కరోనా నేపథ్యంలో ప్రభుత్వ సూచనలు పాటిస్తూ బతుకమ్మను జరుపుకోవాలని సూచిస్తున్నాను’’ అని ట్వీట్ చేశారు.

తాజా వార్తలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!







