భారత్ లో కొత్తగా 61,871 కరోనా పాజిటివ్ కేసులు
- October 18, 2020
న్యూ ఢిల్లీ:భారత్ లో ఇప్పటికే కరోనా కేసుల సంఖ్య 74 లక్షల 94 వేలు దాటాయి. గడచిన 24 గంటలలోనే దేశవ్యాప్తంగా 61,871 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు కరోనా దేశవ్యాప్తంగా నమోదయిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 74,94,552కు చేరింది. గడచిన 24 గంటలలో దేశంలో కరోనా వైరస్ తో మొత్తం 1033 మంది మృత్యువాత పడ్డారు. దీంతో ఇప్పటి వరకు కరోనా బారిన పడి మృతి చెందిన వారి సంఖ్య 1,14,031కు చేరింది. అదే విధంగా గడచిన 24 గంటలలో కరోనా నుంచి కోలుకుని డిశ్ఛార్జ్ అయిన వారి సంఖ్య 72,614గా నమోదయింది.
దీంతో ఇప్పటి వరకు చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 65,97,209 కు చేరింది. ఇక ప్రస్తుతం దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు 7,83,311గా ఉన్నాయి. గడచిన 24 గంటలలో దేశవ్యాప్తంగా 9,70,173 టెస్టులు నిర్వహించగా ఇప్పటివరకు దేశంలో నిర్వహించిన మొత్తం కరోనా టెస్ట్ ల సంఖ్య 9,42,24,190 కు చేరింది. ఇక రికవరీ రేటు విషయానికొస్తే దేశంలో 88.03 శాతం ఉంది. దేశంలో నమోదయిన మొత్తం కేసులలో యాక్టివ్ కేసుల శాతం 10.45 శాతంగా నమోదయింది. దేశంలో మొత్తం నమోదయిన కేసులలో 1.52 శాతానికి మరణాల రేటు తగ్గిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ తెలిపారు.
తాజా వార్తలు
- మహబూలాలో ఇల్లీగల్ స్ట్రీట్ స్టాల్స్ సీజ్..!!
- రాస్ జువాయెడ్ సమీపంలో సముద్రంలో పడి వ్యక్తి మృతి..!!
- దక్షిణ అల్ బతినాలో 47 మంది అరెస్టు..!!
- డీప్‌ఫేక్స్ మార్గదర్శకాలను జారీ చేసిన SDAIA..!!
- గ్లోబల్ టీన్ ఆర్ట్ షోకేస్‌కు కతారా ఆతిథ్యం..!!
- అరబ్ గమ్యస్థానాలకు 45శాతం పెరిగిన విమాన ఛార్జీలు..!!
- హీరో మంచు మనోజ్ చేతుల మీదుగా హియ్య డైనో మండి రెస్టారెంట్ గ్రాండ్ లాంచ్
- పుట్టపర్తిలో అత్యాధునిక కార్డియాక్ క్యాథ్ ల్యాబ్ ప్రారంభం
- IPL 2026: ఐపీఎల్ ఏఐ నకిలీ టికెట్ల ముఠా అరెస్ట్
- బెంగాల్ సీఎంగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారం









