కోవిడ్-19: షార్జా కార్మిక నివాసాల్లో సోదాలు..4 నెలల్లో 21 వేల ఫైన్లు

కోవిడ్-19: షార్జా కార్మిక నివాసాల్లో సోదాలు..4 నెలల్లో 21 వేల ఫైన్లు

షార్జా:షార్జాలో కార్మికులు ఉంటున్న నివాస ప్రాంతాల్లో అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. జన సమూహఆల కారణంగా కోవిడ్ 19 ప్రబలకుండా ఉండేందుకు కార్మికుల నివాస ప్రాంతాలపై షార్జా అధికారులు దృష్టి సారించిన విషయం తెలిసిందే. ఒక్కో గదిలో పరిమితికి మించి ఎక్కువ మంది కార్మికులు ఉండకూడదని గతంలోనే నిబంధనలు విధించింది. పరిమిత సంఖ్యకు మించి ఒక్కో గదిలో ఎక్కువ మంది ఉంటే జరిమానాలు తప్పవని హెచ్చరించిన అత్యవసర, ప్రకృతి విపత్తుల నిర్వహణ విభాగం అధికారులు..కార్మికుల నివాస ప్రాంతాల్లో తనిఖీలు కొనసాగిస్తున్నారు. మే 20 నుంచి ఆక్టోబర్ 1 వరకు నిర్వహించిన తనిఖీల్లో దాదాపు 21 వేల ఉల్లంఘనలు గుర్తించినట్లు అధికారులు వివరించారు. పారిశ్రామిక ప్రాంతాల్లో 6,959 ఉల్లంఘనలు జరిగినట్లు వెల్లడించారు. కోవిడ్ నిబంధనలకు సంబంధించి కార్మికుల్లో అవగాహన కల్పించేందుకు అన్ని భాషలలో విస్తృతంగా కరపత్రాల పంపిణీ చేపట్టినట్లు అధికారులు తెలిపారు. 

--బాలాజీ(మాగల్ఫ్ ప్రతినిధి,షార్జా)

 

Back to Top