కోవిడ్-19: 7 నెలల తర్వాత పవిత్ర మక్కాలో ప్రార్ధనలకు సౌదీ అరేబియా అనుమతి
- October 18, 2020
రియాద్ :పవిత్ర మక్కాలో భక్తులు ప్రార్ధనలు నిర్వహించుకునేందుకు ఎట్టకేలకు సౌదీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే..దేశంలో ఉన్న పౌరులు, ప్రవాసీయులకు మాత్రమే ప్రార్ధనలకు అనుమతించనున్నట్లు స్పష్టం చేసింది. కరోనా వైరస్ ప్రబలిన నాటి నుంచి సామూహిక ప్రార్ధనలను నిషేధించటంతో మక్కా, మదీనాలోనూ భక్తులను అనుమతించలేదు. అన్ లాక్ ప్రక్రియలో భాగంగా విడతల వారీగా ఆంక్షలను సడలిస్తూ వస్తున్న సౌదీ ప్రభుత్వం 7 నెలల తర్వాత మళ్లీ ఇప్పుడు మసీదులోకి భక్తులను అనుమతించేందుకు ఆమోదం తెలిపింది. అయితే..కోవిడ్ 19 నేపథ్యంలో ఆరోగ్య భద్రత నిబంధనలను పాటించాలని కూడా ప్రభుత్వం సూచించింది. ఇదిలాఉంటే ఈ నెల ప్రారంభంలోనే పౌరులు, ప్రవాసీయులకు మక్కా, మదీనాలో ఉమ్రా ప్రార్ధనలకు అనుమతించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు