వందే భారత్ మిషన్:డిసెంబర్ 31 వరకు యూఏఈ నుంచి భారత్ కు టికెట్ల బుకింగ్
- October 18, 2020
యూఏఈ:యూఏఈలో చిక్కుకుపోయిన వారిని భారత్ తీసుకొచ్చేందుకు ప్రత్యేక విమాన సర్వీసులు నడుపుతున్న ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్...వందే భారత్ మిషన్ సర్వీసును డిసెంబర్ 31 వరకు పొడిగించినట్లు ప్రకటించింది. ఏడో విడతలో భాగంగా డిసెంబర్ 31 వరకు భారత్ తిరిగి వచ్చేందుకు వీలుగా బుకింగ్స్ ను కూడా ప్రారంభించినట్లు తెలిపింది. నిజానికి యూఏఈ-భారత్ మధ్య కుదిరిన బబుల్ ఫ్లైట్స్ ఒప్పందం అక్టోబర్ 25తో ముగుస్తుంది. కానీ, గల్ఫ్ లోని కొన్ని దేశాలకు భారత్ నుంచి ప్రయాణాలపై ఇంకా ఆంక్షలు కొనసాగుతున్న విషయం తెలసిందే. దీంతో ఆయా దేశాల్లో ఉంటున్న భారతీయులు యూఏఈ మీదుగా ఇండియా వచ్చేందుకు సిద్ధపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే యూఏఈ నుంచి భారత్ కు బబుల్ ఫ్లైట్స్ సర్వీసులను డిసెంబర్ 31 వరకు పొడిగిస్తూ..బుకింగ్స్ ను ప్రారంభించింది ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్. యూఏఈ నుంచి భారత్ చేరుకోవాలనుకునే వారు ఎయిర్ ఇండియా అధికారిక వెబ్ సైట్(https://www.airindiaexpress.in/en/book-flight) నుంచి టికెట్లను బుక్ చేసుకోవచ్చు. లేదంటే ఎయిరిండియా కాల్ సెంటర్, అధికారిక ట్రావెల్ ఏజెంట్ల ద్వారా టికెట్లను బుక్ చేసుకోవచ్చు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష