దేశ పౌరులకు మాత్రమే శీతాకాలపు వ్యాక్సిన్..ప్రకటించిన కువైట్
- October 18, 2020
కువైట్ సిటీ:ప్రతి ఏడాది వేసే శీతాకాలపు వ్యాక్సిన్ విషయంలో కువైట్ వైద్య ఆరోగ్య శాఖ కీలక ప్రకటన చేసింది. 2020-2021కి సంబంధించి శీతాకాలపు వ్యాక్సిన్ కేవలం దేశ పౌరులకు మాత్రమే పరిమితం చేసినట్లు ప్రకటించింది. సీజన్ వ్యాధుల బారి నుంచి కాపాడేందుకు రోగ నిరోధక శక్తి పెంచేలా వ్యాక్సిన్ వేస్తున్నట్లు అధికారులు తెలిపారు. బ్యాక్టిరియా కారణంగా సక్రమించే వ్యాధులను ఎదుర్కోవటంలోనూ వ్యాక్సిన్ ప్రయోజనకారిగా ఉంటుందని వెల్లడించారు. దేశంలోని ప్రజలంతా ఆరోగ్యవంతులుగా ఉండాలన్నదే తమ అభిలాష అయినా..ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో వ్యాక్సిన్ కేంద్రాలకు దేశ పౌరులను మాత్రమే అనుమతి ఇస్తున్నట్లు వివరించారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు