యూఏఈ, ఇజ్రాయెల్ మధ్య త్వరలోనే విమానాల రాకపోకలు..శాంతి ఒప్పందంలో కీలక అడుగు
- October 19, 2020
యూఏఈ:దౌత్య సంబంధాలను పునరుద్ధరించేలా ఇటీవలె చారిత్రాత్మక శాంతి ఒప్పందం చేసుకున్న యూఏఈ, ఇజ్రాయెల్..శాంతి ఒప్పందానికి అనుగుణంగా మరో కీలక అడుగు వేయబోతున్నాయి. రెండు దేశాల మధ్య విమానాల రాకపోకలకు అనుమతి ఇస్తూ ద్వైపాక్షిక ఒప్పందం చేసుకోబోతున్నాయి. రెండు దేశాల ప్రతినిధులు ఈ మేరకు రేపు సంతకం చేయనున్నట్లు ఇజ్రాయెల్ రవాణా శాఖ మంత్రి స్పష్టం చేశారు. వారానికి ఒకటి చొప్పున 28 వారాల పాటు ఇజ్రాయెల్ బెన్ గురియన్ విమానాశ్రయం నుంచి దుబాయ్, అబుధాబికి విమానాల సర్వీసులను నడిపేలా ఒప్పందం చేసుకుంటారు. ఇక చార్టెర్డ్ విమానాలను అపరిమితంగా నడుపుకోవచ్చు. వారానికి ఒకటి చొప్పున పది వారాల పాటు కార్గో ఫ్లైట్స్ ను కూడా అపరేట్ చేయనున్నారు. రేపు ఒప్పంద పత్రాలపై సంతకం చేసిన తర్వాత కొన్ని వారాల్లోనే విమానాల రాకపోకలు ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయని ఇజ్రాయెల్ తెలిపింది.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష