పబ్లిక్ సెక్టార్ ఉద్యోగాల్లో ప్రవాసీయులను అనుమతించేది లేదని కువైట్ స్పష్టీకరణ

- October 19, 2020 , by Maagulf
పబ్లిక్ సెక్టార్ ఉద్యోగాల్లో ప్రవాసీయులను అనుమతించేది లేదని కువైట్ స్పష్టీకరణ

కువైట్ సిటీ:ప్రభుత్వ రంగంలోని ఏ విధమైనా ఉద్యోగాలను ప్రవాసీయులతో భర్తీ చేసే ప్రసక్తే లేదని కువైట్ సివిల్ సర్వీస్ కమిషన్ తేల్చి చెప్పింది. అంతేకాదు..కాంట్రాక్ట్ ప్రాతిపాదికన ప్రవాసీయుల సేవలను వినియోగించుకోవాలని ప్రభుత్వ సంస్థల నుంచి ఎలాంటి సిఫార్సులు వచ్చినా మరో ఆలోచన లేకుండా తిరస్కరిస్తామని కూడా స్పష్టత ఇచ్చింది.  ప్రవాసీయులను సెకండ్ కాంట్రాక్ట్ నుంచి మెయిన్ కాంట్రాక్ట్ లోకి భర్తీ చేసుకునేలా అవకాశం కల్పించాలంటూ కువైట్ మున్సిపాలిటీ..సివిల్ సర్వీస్ కమిషన్ ను కోరిన నేపథ్యంలో సీఎస్సీ ఈ మేరకు ప్రకటించింది. ఇకపై ప్రభుత్వ రంగంలోని కాంట్రాక్ట్ ఉద్యోగాల్లో ప్రవాసీయులను భర్తీ చేయాలన్న ప్రతిపాదనలను అంగీకరించబోమని తెలిపింది. ఇటీవలె కువైట్ సహాకార సంఘాల్ల ద్వారా పంపిణీ చేసే సబ్సిడీ అహార పదార్ధాలకు సంబంధించి అవకతవకలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ప్రజలకు అందాల్సిన సబ్సిడీ అహార పదార్ధాలు కువైట్ దాటి గల్ఫ్ లోని ఇతర దేశాలకు చేరానట్లు అరోపణలు ఉన్నాయి. ఈ కేసులో కువైట్ సహాకర సంఘాల్లో విధులు నిర్వహించే 52 మంది అకౌంటెంట్ల హస్తం ఉందని కువైట్ వాణిజ్య మంత్రిత్వ శాఖ గుర్తించింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ రంగంలోని కాంట్రాక్ట్ ఉద్యోగాల్లో ప్రవాసీయుల స్థానంలో కువైటీయులు, కువైట్ మహిళల పిల్లలు, కువైట్ సంచార జాతీయులను భర్తీ చేయాలని గత వారమే ఎంపీలు అందరూ వాణిజ్య మంత్రిత్వ శాఖను కోరింది. ఈ నేపథ్యంలో ఇకపై ప్రభుత్వ రంగంలో కాంట్రాక్ట్ ప్రాతిపాదికన ప్రవాసీయులకు అవకాశం కల్పించబోమంటూ సీఎస్సీ స్పష్టం చేసింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com