బహ్రెయిన్:ఏటీఎం కార్డులను చోరీ చేసి డబ్బు దోచుకున్న ముగ్గురు వ్యక్తుల అరెస్ట్
- October 19, 2020
మనామా:ఏటీఎం కార్డులను చోరీ చేసి ఆర్ధిక నేరాలకు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను బహ్రెయిన్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు ముగ్గురు తాము దొంగిలించిన ఏటీఎం కార్డుల విదేశాల్లో ఉన్న నాలుగో నిందితుడికి చేరవేసి..అతని ద్వారా అక్రమంగా డబ్బు బదిలీ చేసుకున్నారు. అయితే..బాధిత కంపెనీల్లో ఒక కంపెనీ కార్డుల ద్వారా అనుమానస్పద లావాదేవీలను గుర్తించి పోలీసులను ఆశ్రయించింది. ఎలక్ట్రానిక్ కార్డుల ద్వారా కింగ్డమ్ వెలుపల లావాదేవీలు జరిగాయని, దీనిపై తమకు సందేహాలు ఉన్నాయని తమ ఫిర్యాదులో పేర్కొంది. దీంతో విచారణ చేపట్టిన అవినీతి నిరోధక శాఖ, ఎలక్ట్రానిక్ సెక్యూరిటీ విభాగం అధికారులు ఎలక్ట్రానిక్ కార్డుల ద్వారా చోరీ జరిగినట్లు గుర్తించారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. నిందితులు అంతా అరబ్ దేశస్తులేనని వెల్లడించారు. ఇక కింగ్డమ్ వెలుపల ఉన్న నాలుగో నిందితుడ్ని అరెస్ట్ చేసేందుకు బహ్రెయిన్ అధికారులు ఇంటర్ పోల్ సహాయాన్ని కోరారు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు