కోవిడ్ 19 వ్యాక్సిన్: ఆశలు చిగురిస్తున్నాయ్గానీ..
- October 19, 2020
యూఏఈ: దేశంలో కోవిడ్ వ్యాక్సిన్ ట్రయల్స్‌పై వైద్యులు ఆశావహ దృక్పథంతో వున్నప్పటికీ, పెద్దయెత్తున వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేందుకు సమయం పడుతుంది గనుక, అప్పటివరకు రెసిడెంట్స్ అలాగే సిటిజన్స్ అప్రమత్తంగా వుండాల్సిందే. దుబాయ్‌లోని ప్రైవ్‌ు హాస్పిటల్ కన్సల్టెంట్ ఇంటర్నల్ మెడిసిన్, చెయిర్ ఆఫ్ మెడిసిన్ డాక్టర్ దిరార్ అబ్దుల్లా మాట్లాడుతూ, వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత కూడా కొంతకాలం పాటు సోషల్ డిస్టెన్సింగ్ పాటించడం, అలాగే మాస్క్‌లు ధరించడం తప్పకపోవచ్చని అభిప్రాయపడ్డారు. ఎక్కువమందికి వ్యాక్సిన్ అందుబాటులోకి రావడానికి చాలా సమయం పడుతుందని ఆయన పేర్కొన్నారు. కాగా, యూఏఈలో అత్యధిక రోజువారీ కేసులో శనివారం (1,538) నమోదయ్యాయి. అక్టోబర్ 6 నుంచి సగటున ప్రతి రోజూ వెయ్యికి పైగా కేసులు యూఏఈలో నమోదవుతున్నాయి. వ్యాక్సిన్ వచ్చాక పరిస్థితులు ఎలా వుంటాయి.? అన్న విషయాన్ని పక్కన పెడితే, ఈలోగా కరోనా వ్యాప్తి జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని వైద్యులు సూచిస్తున్నారు. కాగా, యూఏఈలో ప్రస్తుతం ట్రయల్స్ దశలో వున్న వ్యాక్సిన్‌కి యూఏఈ ప్రభుత్వం అత్యవసర అనుమతినిచ్చింది. చైనాకి చెందిన సినోఫాం ఈ వ్యాక్సిన్‌ని అభివృద్ధి చేసింది. వీటిని ఫ్రంట్ లైన్ వారియర్స్‌కి వినియోగించేందుకు సిద్ధమవుతున్నారు. మరోపక్క, రష్యాకి చెందిన ‘స్పుత్నిక్ వి’ వ్యాక్సిన్ ట్రయల్స్ కూడా దేశంలో జరుగుతున్నాయి.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు