రీ - ఓపెన్ తర్వాత కువైట్ ఎయిర్‌పోర్ట్ నుంచి 332,000 మంది ప్రయాణం
- October 19, 2020
కువైట్: కరోనా నేపథ్యంలో విధించబడిన లాక్‌డౌన్ తర్వాత, పరిస్థితులు కొంత అదుపులోకి రావడంతో ఆగస్ట్ నుంచి విమాన రాకపోకలకు అనుమతి లభించిన సంగతి తెలిసిందే. ఆగస్ట్ నుంచి ఇప్పటిదాకా 80 రోజుల్లో 197,000 మంది ప్రయాణీకులు కువైట్ నుంచి డిపోర్ట్ అయ్యారు. కాగా, ఇదే సమయంలో మొత్తం 135,000 మంది ప్రయాణీకులు కువైట్‌కి వచ్చారు. మొత్తం 1965 విమాన సర్వీసులు నడవగా, వివిధ సంస్థలు విమానాల్ని ఆపరేట్ చేశాయి. ఫస్ట్ ఫేజ్‌లో 30 శాతం మించకుండానే ప్రయాణాలు జరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ప్రధానంగా టర్కీ, దుబాయ్ మరియు దోహాలకు విమానాలు ఎక్కువగా నడిచాయి. కాగా, నిషేధ జాబితాలో వున్న 34 దేశాల నుంచి ప్రయాణీకులు కువైట్‌కి రావాలనుకుంటే పిసిఆర్ సర్టిఫికెట్ తప్పనిసరి. 72 గంటల ముందుగా పిఆర్ టెస్ట్ చేయించుకోవాల్సి వుంటుంది. కువైట్‌కి వచ్చిన తర్వాత 14 రోజుల హోం క్వారంటైన్ వీరికి తప్పనిసరి.
తాజా వార్తలు
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన