'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' ప్రీ టీజర్
- October 19, 2020అఖిల్ అక్కినేని హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్'. అల్లు అరవింద్ సమర్పణలో జీఏపిక్చర్స్ బ్యానర్‌పై బన్నీవాస్, వాసువర్మ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సోమవారం ఈ సినిమా ప్రీ టీజర్‌ను విడుదల చేశారు. "హాయ్.. ఐయామ్ హర్ష. ఒకబ్బాయి కెరీర్లో ఫిఫ్టీ పర్సెంట్ కెరీర్, ఫిప్టీ పర్సెంట్ మ్యారీడ్ లైఫ్ ఉంటుంది. కెరీర్‌ను సూపర్‌గా సెట్ చేశాను. ఈ మ్యారీడ్ లైఫే అయ్యయ్యో అంటూ ఒంటి కాలిపై నిలబడే" డైలాగ్‌తో అఖిల్ అక్కినేని ఆకట్టుకున్నారు. టీజర్‌ను అక్టోబర్ 25 ఉదయం 11 గంటల 40 నిమిషాలకు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమాను విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
తాజా వార్తలు
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్‌కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్‌పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్‌పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్