చంద్రుడిపై 4జీ..నాసా కు సాయం అందించనున్న నోకియా

- October 19, 2020 , by Maagulf
చంద్రుడిపై 4జీ..నాసా కు సాయం అందించనున్న నోకియా

వాషింగ్టన్: చంద్రుడిపై నిలబడి ఆస్ట్రోనాట్‌లు సెల్ఫీలు దిగితే..? వాటిని అప్పటికప్పుడే ట్విటర్‌లో అప్‌లోడ్ చేస్తే..చిన్ని చిన్ని వీడియోలు కూడా సోషల్ మీడియా ద్వారా షేర్ చేయగలిగితే.. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ.! అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ప్రస్తుతం చేపడుతున్న ప్రయత్నాలు ఫలిస్తే ఈ ఊహలన్నీ త్వరలో నిజం అవుతాయి.

అవును.. చంద్రుడిపై కనెక్టివిటీనీ పెంచేందుకు ప్రముఖ టెక్ సంస్థ నోకియా, అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా సంయుక్తంగా చంద్రుడిపై 4జీ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. దీని కోసం నాసా ఏకంగా 14.1 మిలియన్ డాలర్లను కేటాయించింది. 4జీతో ప్రారంభించి ఆ తరువాత 5జీ టెక్నాలజీని కూడా ఏర్పాటు చేయాలనేది నాసా ఆలోచన. 

ఈ క్రతువులో పాలుపంచుకునేందుకు నోకియాకు చెందిన పరిశోధన విభాగం బెల్ ల్యాబ్స్‌ను కీలక భాగస్వామిగా ఎంపిక చేసింది. టిప్పింగ్ పాయింట్ టెక్నాలజీస్ పేరిట చేపడుతున్న ఈ ప్రాజెక్టు ద్వారా అంతరిక్షంలో సమాచార మార్పిడిని మరింత వేగవంతమవుతుందని నాసా పేర్కొంది. దీనిపై బెల్ ల్యాబ్స్‌ కూడా స్పందించింది. తాము కీలక భాగస్వామిగా ఎంపికైనందుకు సంతోషం వ్యక్తం చేసింది. చంద్రుడిపై మానవాళి సుస్థిర నివాసం ఏర్పాటు చేసేందుకు ఈ ప్రయత్నాలు దోహద పడతాయని తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com