దుబాయ్: వచ్చే వారంలో ఈ-స్కూటర్ ప్రాజెక్ట్ ట్రయల్ రన్ ప్రారంభం
- October 20, 2020
దుబాయ్:పర్యావరణహితం, ట్రాఫిక్ ఇబ్బందులను తగ్గించేందుకు దోహదపడే ఈ-స్కూటర్ లను వచ్చే వారంలో ప్రారంభించనున్నట్లు రోడ్డు, రవాణా అధికార విభాగం ప్రకటించింది. న్యూ అల్ ఘుబైబా బస్ స్టేషన్ సందర్శనలో భాగంగా దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఈ ఈ-స్కూటర్ ప్రాజెక్ట్ గురించి వివరించారు. ఈ-స్కూటర్ ప్రాజెక్టులో ఐదు ఆపరేట్ సంస్థలు భాగస్వామ్యం అవుతన్నట్లు ఆర్టీఏ వివరించింది. వీటిలో కారెం, లైమ్, టైర్ అనే మూడు అంతర్జాతీయ సంస్థలతో పాటు దుబాయ్ ఎస్ఎంఈ మద్దతు ఉన్న రెండు స్థానిక సంస్థలు అర్నాబ్, స్కుర్ట్ భాగస్వామ్యం అవుతున్నాయి. ట్రయల్ రన్ గా ప్రస్తుతం దుబాయ్ లోని ఐదు జోన్లలో ఈ-స్కూటర్ ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. మొహమ్మద్ బిన్ రషీద్ బౌలేవార్డ్, దుబాయ్ ఇంటర్నెట్ సిటీ, రెండో డిసెంబర్ సెయింట్, అల్ రిగ్గ, జుమేరా లేక్ టవర్స్ జోన్లను ఈ-స్కూటర్ ప్రాజెక్టు ప్రారంభానికి ఎంపిక చేశారు. జనాభా సాంద్రత, ప్రైవేట్ సంస్థల అభివృద్ధి సూచిక, ప్రజా రవాణా సేవల లభ్యత, సమీకృత మౌలిక సదుపాయాలు, అధిక ట్రాఫిక్ భద్రతా రికార్డులు వంటి నిర్దిష్ట ప్రమాణాల ప్రకారం ఈ జోన్లను ఎంపిక చేసినట్లు ఆర్టీఏ వెల్లడించింది.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







