ఒమన్, ఇండియా ప్రతినిధుల సమావేశం..పలురంగాల్లో పరస్పర సహకారంపై చర్చ
- October 20, 2020
మస్కట్:ద్వైపాక్షిక సంబంధాల పటిష్టత, పలు రంగాల్లో ఇరు దేశాల మధ్య పరస్పర సహకారంపై చర్చించేందుకు ఒమన్, భారత్ ప్రతినిధులు సంయుక్త సమావేశంలో పాల్గొన్నారు. ఒమన్ తరపున వాణిజ్య, పారిశ్రామిక, పెట్టుబడి వ్యవహారాల మంత్రిత్వ శాఖ మంత్రి ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగినట్లు ఒమన్ అధికారులు తెలిపారు. ఆన్ లైన్ ద్వారా జరిగిన ఈ మీటింగ్ లో పలు రంగాల్లో పెట్టుబడులు, పరస్పర సహకారంపై ప్రతినిధులు చర్చించారు. ముఖ్యంగా అంతరిక్ష పరిశోధన, పౌర విమానయానం, పునరుత్పాదక శక్తి, సౌర విద్యుత్, అహార భద్రత, వైద్య రంగం, ఐటీ రంగాలకు సంబంధించి ఇరుదేశాలు ఒకరికొకరు సహకరించుకోవాలని డిస్కస్ చేశారు. ఇదిలాఉంటే..కొన్నేళ్లుగా ఒమన్, భారత్ మధ్య వాణిజ్య బంధం మరింత బలపడుతున్నట్లు ఇరు దేశాల ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. గతేడాదిలో భారత్ కు ఒమన్ నుంచి ఎగుమతులు 0.69శాతం పెరిగిందని, దీని విలువ 5.93 బిలియన్ ఒమన్ రియాల్స్ అని అధికారులు వెల్లడించారు. అదే సమయంలో భారత్ నుంచి ఒమన్ కు ఎగుమతులు 33 శాతం పెరిగినట్లు తెలిపారు.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!