బహ్రెయిన్ : ప్రైవేట్ స్కూల్స్ లో తనిఖీలు చేపట్టిన ఆరోగ్య, విద్యా మంత్రిత్వ శాఖ
- October 20, 2020
మనామా:విద్యార్ధుల ఆరోగ్య సంరక్షణ కోసం పాఠశాలల యజమాన్యాలు తగిన జాగ్రత్తలు తీసుకున్నాయో లేదో నిర్ధారించుకునేందుకు ఆరోగ్య మంత్రిత్వ శాఖ, విద్యా మంత్రిత్వ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టారు. అన్ని ప్రైవేట్ స్కూల్స్ ను పరిశీలించిన అధికారులు..కోవిడ్ 19 వ్యాప్తి నియంత్రణకు మంత్రిత్వ శాఖ సూచించిన మార్గనిర్దేశకాలకు అనుగుణంగా సౌకర్యాలు చేపట్టారా..లేదా అని పరిశీలించారు. ప్రస్తుత కరోనా పీడ రోజులను ఎదుర్కొని విద్యార్ధులు వైరస్ బారిన పడకుండా ప్రతి పాఠశాలలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని స్కూల్స్ ప్రారంభ సమయంలోనే ఆరోగ్య శాఖ సూచించిన విషయం తెలిసిందే. స్కూల్ కి వచ్చే ప్రతి ఒక్కరి శరీర ఉష్ణోగ్రతను తనిఖీ చేసిన తర్వాత కంపౌండ్ లోకి అనుమతించాలని, తరగతి గదుల్లో విద్యార్ధులు తప్పనిసరిగా భౌతిక దూరం పాటించేలా సీటింగ్ సౌకర్యం కల్పించాలని అధికారులు తెలిపారు. అలాగే స్కూల్ ప్రాంగణంలోని తరగతి గదులు, ల్యాబ్, టాయిలెట్స్ లను ఎప్పటికప్పుడు శానిటైజ్ చేయాలని అధికారులు స్కూల్స్ యాజమాన్యాలకు సూచించారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







