వీసా-ఫ్రీ ప్రయాణం: ఇజ్రాయెల్‌ - యూఏఈ మధ్య ఒప్పందం

- October 20, 2020 , by Maagulf
వీసా-ఫ్రీ ప్రయాణం: ఇజ్రాయెల్‌ - యూఏఈ మధ్య ఒప్పందం

యూఏఈ మరియు ఇజ్రాయెల్‌ మధ్య వీసా ఫ్రీ ట్రావెల్‌ని తమ జాతీయులకు అందించాలని నిర్ణయించినట్లు ఇజ్రాయెలీ ప్రధాని బెంజిమిన్‌ నెతన్యాహు వెల్లడించారు. కాగా, తొలి యూఏఈ డెలిగేషన్‌ ఇజ్రాయెల్‌లోని బెన్‌ గురియాన్‌ ఎయిర్‌ పోర్ట్‌లో ల్యాండ్‌ అయ్యింది. ‘ఈ రోజు కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టాం’ అని ఈ సందర్భంగా ఇజ్రాయెల్‌ ప్రధాని చెప్పారు. ఎకానమీ, సైన్స్‌, టెక్నాలజీ మరియు ఏవియేషన్‌ రంగాల్లో యూఏఈ - ఇజ్రాయెల్‌ మధ్య ఒప్పందాలు కుదిరినట్లు నెతన్యాహు వెల్లడించారు. బెన్‌ గురియాన్‌ ఎయిర్‌ పోర్ట్‌ వద్ద జరిగిన ప్రెస్‌మీట్‌లో నెతన్యాహు మాట్లాడారు. ఇరు దేశాలకు చెందినవారూ ఇట్నుంచి అటు అట్నుంచి ఇటు వీసా ఎగ్జంప్షన్‌తో ప్రయాణించవచ్చునని చెప్పారు. కాగా, తాజా ఒప్పందాల మేరకు సదరన్‌ ఇజ్రాయెల్‌లోని చిన్న ఎయిర్‌ పోర్ట్‌కి చార్టర్డ్‌ విమానల్ని అలాగే 10 వీక్లీ కార్గో విమానాల్ని నడిపేలా కూడా ఒప్పందం చేసుకోవడం జరిగింది. 28 వీక్లీ కమర్షియల్‌ విమానాల్ని ఇజ్రాయెల్‌లోని గురియాన్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి దుబాయ్‌, అబుదాబీలకు నడపనున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com