పరీక్షింపబడిన కోవిడ్ 19 వాక్సిన్ మాత్రమే కొనుగోలు చేస్తాం: సౌదీ ఆరోగ్య శాఖ మంత్రి
- October 20, 2020
జెడ్డా: సౌదీ హెల్త్ మినిస్టర్ తవ్ఫిక్ అల్ రబియా మాట్లాడుతూ, కరోనా వ్యాక్సిన్ విషయంలో సౌదీ రాజీ పడబోదనీ, పూర్తిస్థాయిలో సురక్షితం అని నిర్ధారితమైన వ్యాక్సిన్‌ని మాత్రమే కొనుగోలు చేస్తామని చెప్పారు. పలు దేశాలు కరోనా వ్యాక్సిన్ తయారీలో నిమగ్నమయ్యాయి. ఈ క్రమంలో కొన్ని దేశాలు వ్యాక్సిన్‌ని తయారు చేశామని చెబుతున్నాయి. అయితే, వ్యాక్సిన్‌పై సందేహాలు మాత్రం అలాగే వున్నాయి. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని సౌదీ ఆరోగ్య శాఖ మంత్రి స్పష్టం చేయడం జరిగింది. ఒక్కోసారి ప్రయోగాల సందర్భంగా నెగెటివ్ ఫలితాలు రావొచ్చనీ, వాటిని అధిగమించి వ్యాక్సిన్ విషయంలో విజయవంతమవ్వొచ్చనీ, ప్రపంచమంతా వ్యాక్సిన్ కోసం ఎదురుచూస్తోందని తావ్ఫిక్ అల్ రబియా చెప్పారు. కాగా, సౌదీ అరేబియాలో సోమవారం 381 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తంగా దేశంలో ఇప్పటిదాకా 348,583 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఇప్పటివరకు 5,201 మంది కరోనాతో ప్రాణాలు కోలోపయారు. 328,895 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష