అమరవీరుల త్యాగాలు మరవలేనివి - రాచకొండ సీపీ మహేష్ భగవత్

- October 21, 2020 , by Maagulf
అమరవీరుల త్యాగాలు మరవలేనివి - రాచకొండ సీపీ మహేష్ భగవత్

తెలంగాణ: పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఈరోజు అంబేరుపేట కార్ హెడ్ క్వార్టర్ లో రాచకొండ సీపీ మహేష్ భగవత్ ఆధ్వర్యంలో అమరవీరుల స్థూపం వద్ద పోలీస్ అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు.  ముందుగా.. ఈ సందర్భంగా రాచకొండ సీపీ మహేష్ భగవత్  మాట్లాడుతూ... అమరవీరుల త్యాగాలు మరవలేనివి అని, పోలీసులు లేని సమాజాన్ని ఊహించలేమన్నారు. పోలీసు వారు వీధుల్లో భాగంగా కుటుంబానికి, పండుగలకు, సంతోషాలకు, సరదాలకు దూరంగా ఉంటూ సమాజ సేవ చేస్తారన్నారు. ప్రజా రక్షణ కోసం ప్రాణాలను సైతం తృణప్రాయంగా విడిచే పోలీస్ అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివని కొనియాడారు. తాను విధుల్లో చేరినప్పటి పరిస్థితులతో పోల్చుకుంటే ఇప్పుడు తెలంగాణలో శాంతి భద్రతలు మెరుగ్గా ఉన్నాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం పోలీస్ శాఖకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడమే ఇందుకు కారణమన్నారు. శాంతి భద్రతల కోసం పౌరులు పోలీసులకు సహకరించి ఫ్రెండ్లీ సిటిజన్స్ అనిపించుకోవాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో శాంతి స్థాపన కోసం పోలీసులు నిర్విరామంగా కృషి చేస్తున్నారన్నారు. తెలంగాణా పోలీసులు దేశంలోనే ఉత్తమ పోలీసులుగా గుర్తింపు తెచ్చుకున్నారని తెలిపారు. అమర వీరుల కుటుంబాలకు మేమున్నామని భరోసా ఇవ్వడానికి ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయన్నారు. ఇప్పటివరకు 16 మంది పోలీసు అధికారులు రాచకొండ కమిషనరేట్ నుండి అమరులయ్యారు అని ఆయన అన్నారు. అనంతరం రాచకొండ సీపీ మహేష్ భగవత్, అడిషనల్ సీపీ సుధీర్ బాబు అమర వీరుల స్థూపానికి సెల్యూట్ చేశారు. తరువాత రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. అమరుల త్యాగాలను స్మరిస్తూ వారి కుటుంబ సభ్యులను శాలువాతో సత్కరించారు. అనంతరం అమర వీరుల కుటుంబ సభ్యులతో మాట్లాడి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. వారికి సంబందించిన సమస్యలను పరిష్కరించే విదంగా చర్యలు చేపట్టారు. హౌస్ సైట్ ప్లాట్ కొరకు రంగా రెడ్డి, నల్గొండ కలెక్టర్లు లతో సీపీ మాట్లాడినరు.  ఈ కార్యక్రమంలో రాచకొండ సి‌పి మహేష్ భగవత్, అడిషనల్ సీపీ సుధీర్ బాబు, మల్కాజిగిరి డీసీపీ రక్షిత మూర్తి, ఎల్బీ నగర్ డీసీపీ సన్ ప్రీత్ సింగ్, యాదాద్రి డీసీపీ నారాయణ రెడ్డి, డీసీపీ క్రైమ్స్ యాదగిరి, ఏడిసిపిలు శిల్పవల్లి (అడ్మిన్) సురేందర్ (ఎస్ఓటి), మనోహర్ (ట్రాఫిక్), వెంకటేశ్వర్లు (సి ఎస్ డబ్ల్యూ), శంకర్ నాయక్, శమీర్ (హెడ్ క్వార్టర్స్), పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు భద్రారెడ్డి, జాయింట్ సెక్రటరీ వెంకటయ్య, సభ్యులు కృష్ణారెడ్డి, ఇతర పోలీస్ అధికారులు, అమరవీరుల కుటుంభ సభ్యులు, రిటైర్డ్ పోలీస్ ఉద్యోగులు, ట్రైనీ కానిస్టేబుళ్లు తదితరులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com