బహ్రెయిన్:రెస్టారెంట్లు, కేఫ్ లలో టేబుల్ సర్వింగ్ కు గ్రీన్ సిగ్నల్
- October 22, 2020
మనామా :హోటల్ లోపల డైనింగ్ కు అనుమతి ఇస్తూ బహ్రెయిన్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇక నుంచి రెస్టారెంట్లు, కేఫ్ లోపల కూడా డైనింగ్ కు వెసులుబాటు ఉండనుంది. లాక్ డౌన్ తర్వాత దాదాపు ఏడు నెలలుగా హోటల్స్ లోపల సర్వింగ్ పై నిషేధం ఉన్న విషయం తెలిసిందే. అన్ లాక్ ప్రక్రియలో భాగంగా దశల వారీగా ఆంక్షలను సడలిస్తూ వస్తున్న బహ్రెయిన్ ప్రభుత్వం గత సెప్టెంబర్ లోనే రెస్టారెంట్ వెలుపల ఔట్ డోర్ డైనింగ్ కు అనుమతి ఇచ్చింది. ఇక ఇప్పుడు తాజాగా ఇండోర్ డైనింగ్ కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే..రెస్టారెంట్లు, కేఫ్ లలో 30 మందికి మించి అనుమతించొద్దని కూడా షరతు విధించింది. ఆరోగ్య శాఖ జారీ చేసిన మార్గనిర్దేశకాలను ఖచ్చితంగా పాటించాలని హెచ్చరించింది. గతంలో ఔట్ డోర్ డైనింగ్ కు అనుమతి ఇచ్చిన సమయంలోనూ ఆరోగ్యశాఖ జారీ చేసిన మార్గనిర్దేశకాలను పాటించని పలు రెస్టారెంట్లపై చర్యలు తీసుకున్నారు. హోటల్స్, రెస్టారెంట్లు, కేఫ్ లలో కోవిడ్ నిబంధనల అమలుపై ఎప్పటికప్పుడు తనిఖీలు చేపడతామని, ఇది నిరంతరాయంగా కొనసాగే ప్రక్రియ అని ఆరోగ్య శాఖ అధికారులు హెచ్చరించారు.
తాజా వార్తలు
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన