బీహార్ ఎన్నికలు: మేము గెలిస్తే అందరికీ ఉచిత వ్యాక్సిన్ ఇస్తామంటూ బీజేపీ హామీ
- October 22, 2020
పాట్నా: ‘ పాంచ్ సూత్ర, ఏక్ లక్ష్య, 11 సంకల్ప’ పేరిట బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి భారతీయ జనతా పార్టీ(బీజేపీ) ఎన్నికల మేనిఫెస్టో విడుదలైంది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం ఈ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. భారత్‌లో కరోనా వ్యాక్సిన్ ట్రయిల్స్ పూర్తయి, పెద్ద మొత్తంలో ఉత్పత్తి మొదలవగానే బిహార్ ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్‌ను అందిస్తామని చెప్పారు. ఇదే తమ మొదటి ఎన్నికల హామీగా ఆమె పేర్కొన్నారు. బిహార్ ప్రజలకు రాజకీయ విషయాలపై పూర్తి స్థాయి అవగాహన ఉందని, పార్టీలు ఇచ్చే హామీలను వారు అర్థం చేసుకోగలరన్నారు. ఎవరైనా తమ పార్టీ మేనిఫెస్టోపై ప్రశ్నలు సంధిస్తే ఆత్మవిశ్వాసంతో బదులివ్వగలమని, అదే విధంగా ఇచ్చిన హామీలను నిలబెట్టుకోగలమని స్పష్టం చేశారు.
బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలోని మరికొన్ని కీలక హమీలు :
1) రానున్న ఐదేళ్లలో 5 లక్షల ఉద్యోగాలు.
2) మూడు లక్షల ఉపాద్యాయ ఉద్యోగాలు.
3) ఆరోగ్య రంగంలో లక్ష ఉద్యోగాలు.
4) ఐటీ హబ్‌గా బిహార్ అభివృద్ధి .
5) తొమ్మిది, పై తరగతుల్లో అధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ఉచిత ట్యాబ్‌లు.
6) గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని 30 లక్షల మందికి ఉచిత ఇళ్లు.
7) ఇతర రాష్ట్రాలలో మృత్యువాత పడ్డ వలస కూలీ కుటుంబానికి 2 లక్షల ఎక్స్‌గ్రేషియా.
8) దేశం కోసం ప్రాణాలర్పించిన సైనికుడి కుటుంబానికి 25 లక్షల రూపాయల ఆర్థిక సాయం, వారి ఇంట్లో ఒకరికి ఉద్యోగం.
తాజా వార్తలు
- పాస్‌పోర్ట్ సేవల్లో తెలంగాణ పోలీసులకు జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక పురస్కారం
- సీఎం చంద్రబాబు నాయుడిని మర్యాదపూర్వకంగా కలిసిన బాబా రామ్‌దేవ్
- ఇరాన్ కు ఒక్క పైసా కూడా ఇవ్వం అంటూ ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- ‘యంగ్ ఇండియా స్టూడెంట్ కిట్’ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్
- విజయవాడలో సరికొత్త ఫుడ్ యాప్ ‘టోయింగ్’ ప్రారంభం
- ప్రపంచ దేశాలకు ఇరాన్ మరో బిగ్ షాక్..
- కోల్‌కతాలో పారిశ్రామిక వేత్తలతో మంత్రి లోకేశ్ వరుస భేటీలు
- కువైట్ కి రోజువారీ విమాన సర్వీసులు పునఃప్రారంభిస్తున్న ఖతార్ ఎయిర్వేస్
- సోషల్ మీడియాలో అక్రమ వీసా సేవలపై దుబాయ్ అధికారుల కొరడా
- వాహనాల నుంచి చెత్త వేస్తే భారీ జరిమానా







