పాకిస్తాన్ లో 'అంతర్యుధ్ధం'

- October 22, 2020 , by Maagulf
పాకిస్తాన్ లో \'అంతర్యుధ్ధం\'

పాకిస్తాన్ లో అంతర్యుధ్ధం వంటి తీవ్ర పరిస్థితి తలెత్తింది. సింధ్ ప్రావిన్స్ పోలీసులు బాహాటంగా సైన్యంపై తిరగబడ్డారు. ఉభయ పక్షాల మధ్య దాడులు, ప్రతిదాడులు జరిగాయి. తొలుత సింద్ లో ముస్తాక్ అహ్మద్ మహర్ అనే ఐజీపీని కిడ్నాప్ చేశారని పారామిలిటరీ దళాలపై ఆరోపణలు తలెత్తాయి. తమను 'రేంజర్లు'గా చెప్పుకుంటున్న వీరు ముస్తాక్ ని కిడ్నాప్ చేశారని, ప్రతిపక్షనేత బిల్వాల్ భుట్టో జర్దారీకి అధికార ప్రతినిధి అయిన సఫ్దర్ అవాన్ ను అరెస్టు చేయాలని ఆదేశించాలంటూ బలవంతంగా ఆయన చేత సంతకం చేయించుకున్నారని వార్తలు వచ్చాయి. నాలుగు గంటలపాటు వారు ఆయనను బందీగా ఉంచుకున్నారట. స ఫ్దర్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ అల్లుడు. (ఈయన భార్య మరయం నవాజ్). ఓ కేసులో సప్దర్ ఇటీవలే సింధ్ కోర్టు నుంచి బెయిల్ పొందారు. కాగా-పోలీసు అధికారి కిడ్నాప్ వ్యవహారంపై ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం స్పందించనప్పటికీ ఆర్మీ చీఫ్ ఖమర్ జావేద్ బాజ్వా దర్యాప్తునకు ఆదేశించారు. రెండేళ్ల క్రితం ఇమ్రాన్ అధికారంలోకి వఛ్చినప్పటి నుంచి ఇంత పెద్ద ఘటన జరగడం ఇదే మొదటిసారి. తమ దేశ సైన్యం అత్యాచారాలకు పాల్పడుతోందని సింధ్ ప్రావిన్స్ పోలీసులు ఆరోపిస్తున్నారు. పాకిస్తాన్ డెమొక్రటిక్ మూవీ మెంట్ పేరిట ఓ సంస్థను ఏర్పాటు చేసిన వీరు.. ఇమ్రాన్ ప్రభుత్వం మిలటరీ చేతిలో కీలుబొమ్మ సర్కార్ గా మారిందని దుయ్యబడుతున్నారు. కరాచీలో వీరు భారీ ర్యాలీ నిర్వహించారు.

అటు-ఇప్పటికే ఇమ్రాన్ ఖాన్ రాజీనామా చేయాలంటూ దేశవ్యాప్త నిరసనలు మొదలయ్యాయి. 11 ప్రతిపక్షాల కూటమి ఖాన్ ను బర్తరఫ్ చేయాలంటూ ఆందోళనలు చేస్తోంది. దేశంలో అరాచకం తాండవిస్తోందని ఈ పార్టీల నేతలు ఆరోపిస్తున్నారు.

ఇదిలా ఉండగా కరాచీలో తామున్న హోటల్ లోకి పోలీసులు బలవంతంగా తలుపులు పగులగొట్టుకుని వఛ్చి తన భర్తను అరెస్టు చేశారని స ఫ్దర్ అవాన్ భార్య మరయం నవాజ్ ఆరోపించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com