హనుమాన్ చాలీసా డివోషనల్ సాంగ్ ని లాంచ్ చేసిన సాయి కుమార్!!

- October 22, 2020 , by Maagulf
హనుమాన్ చాలీసా డివోషనల్ సాంగ్ ని లాంచ్ చేసిన సాయి కుమార్!!

 హనుమాన్ చాలీసా అంటే ఇష్టపడని వారు ఉండరు. అలాంటి హనుమాన్ చాలీసాని సింగర్ కం డైరెక్టర్ రుషిక అద్భుతంగా ఆలపించి నటించారు. హనుమాన్ చాలీసా డివోషనల్ సాంగ్ తో రుషిక హావభావాలు అన్ని హైలెట్ అనేలా ఉన్నాయని...  ఈ హనుమాన్ చాలీసా డివోషనల్ సాంగ్ లాంచ్ చేసిన సాయి కుమార్ ప్రత్యేకంగా సింగర్ రుషిక ని మెచ్చుకున్నారు. సాంగ్ అద్భుతంగా ఉందని.. క్వాలిటీ పరంగా హై స్టాండడ్స్ తో ఈ సాంగ్ ని తెరకెక్కించారని.. ఈ పాటని ఆలపించి, డైరెక్ట్ చేసి, నటించిన రుషికాని సాయి కుమార్ అభినందించారు.

రుషిక మాట్లాడుతూ..  మేము హనుమాన్ చాలీసాని ప్రస్తుత తరానికి అర్ధమయ్యే రీతిలో కాస్త వినూత్నంగారాప్ మోడల్ లో చిత్రీకరించటం జరిగింది. లిరిక్స్/సాహిత్యాన్ని మాత్రం మార్చలేదు. పాటచిత్రీకరణలో ఉపయోగించిన చిత్రాలు మరియు ప్రదేశాల అనుమతులు అన్ని తీసుకోవటం జరిగింది. పాట కి సంబందించిన కొన్ని పనుల కోసం పద్మజ హాస్పిటల్ & స్కిల్టెక్నాలజీస్ వారి సహాయం తీసుకోవటం జరిగింది. ఎలాంటి ఆర్థిక/లాభాపేక్ష లేకుండా కేవలంహనుమాన్ చాలీసాని ప్రజలకు మరింత చేరువ చేయటం కోసం మాత్రమే ఈ పాటని చిత్రీకరించి, విడుదలచేయటం జరిగింది.
 ఈ పాట ని ప్రచురించటానికి, ప్రసారం చేయటానికి, టెలివిజన్లు & సోషల్ మీడియాతదితర రంగాలకి ఇత్య టీవీ యాజమాన్యం పూర్తి అనుమతినిస్తుందని తెలియజేస్తున్నాము. 

దర్శకత్వం/నటన/గాయకురాలు - రుషిక 
అలంకరణ - లక్ష్మణ్
చిత్రీకరణ - రుద్ర ఈక్విప్మెంట్స్
చిత్రీకరణ సహాయకులు - విష్ణు వర్ధన్ 
డి.ఓ.పి/ఎడిటర్ - నవీన్ తొగిటి
ఔట్ డోర్ యూనిట్- ఎస్.ఆర్.లైట్స్
లైట్ ఆఫీసర్ - నాని చౌదరి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com